షుగర్ పేషెంట్స్ ఖచ్చితంగా తాగాల్సిన రసాలు ఇవే?

Purushottham Vinay
డయాబెటిక్ పేషెంట్స్ కొన్ని రకాల జ్యూస్ లు తాగితే షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  కాకరకాయ రసం వంటి ఆయుర్వేదం కాషయంతో పాటు చాలా రకాల ఇతర జ్యూస్‌లు కూడా ఉన్నాయి. వాటిలో ఏదో ఒక దాన్ని క్రమం తప్పకుండా తాగడం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్థులు షుగర్ లెవెల్స్‌ని ఖచ్చితంగా నియంత్రించవచ్చు. మరి షుగర్ ని కంట్రోల్ చేసే జ్యూస్‌లేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..ఉసిరి రసం షుగర్ రోగులకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇక ఈ రసం చేయడానికి, రెండు చెంచాల ఉసిరి రసాన్ని తీసి తరువాత దానికి చిటికెడు పసుపు పొడిని కలపండి. ఆ తరువాత ప్రతి ఉదయం- సాయంత్రం ఈ మిశ్రమాన్ని తాగండి. ఈ జ్యూస్ తాగడం వల్ల శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్ అనేది చాలా ఈజీగా కంట్రోల్ అవుతుంది.ఇంకా అలాగే సొరకాయ రసం మధుమేహ రోగులకు  చాలా ఉపయోగకరంగా ఉంటుంది.


ఈ సొరకాయ రసం తాగడం వల్ల బ్లడ్ షుగర్ ఈజీగా అదుపులో ఉంటుంది.అలాగే బరువు కూడా అదుపులో ఉంటుంది. ఇంకా అలాగే మీరు బరువు పెరుగుటతో పాటు అధిక రక్త చక్కెరతో బాధపడుతున్నట్లయితే సొరకాయ రసం మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.అలాగే మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా ఈ పాలకూర చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పాలకూరలో విటమిన్ ఎ, విటమిన్ బి, సి ఇంకా ఇ పుష్కలంగా ఉన్నాయి.పాలకూర రసం తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి చాలా సులభంగా అదుపులో ఉంటుంది.అలాగే కాకరకాయ రసం మధుమేహ రోగులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.ఎందుకంటే కాకరలో యాంటీడయాబెటిక్ గుణాలు ఉన్నాయి కాబట్టి మధుమేహాన్ని నియంత్రించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటాయి. కాకర జ్యూస్ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. కాబట్టి డయాబెటిక్ పేషెంట్లు రోజూ కాకర జ్యూస్ ని తాగండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: