కరివేపాకుతో 5 రోజుల్లో గ్రే హెయిర్ కి బై చెప్పండి..!

Divya
జీవనవిధానం, ఆహార అలవాట్లు వల్ల చాలామంది చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్యతో విపరీతంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యను పోగొట్టుకోవడానికి రకరకాల షాంపూలు, డై లు వాడుతుంటారు.అవి తాత్కాలికంగా ఉపయోగపడినా,మళ్లీ గ్రే హెయిర్ రావడంతో ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి సమస్యను ఎదుర్కొనేవారు మనకు సహజంగా దొరికే కరివేపాకుతో కొన్ని రకాల చిట్కాలను ఉపయోగించడం వల్ల ఐదు రోజుల్లో గ్రే హెయిర్ కు చెక్ పెట్టొచ్చు. కరివేపాకు వల్ల జుట్టు పొడవుగా, నల్లగా, ఒత్తుగా మారుతుంది. ఇన్ని ఉపయోగాలున్నా కరివేపాకుతో హెయిర్ ప్యాక్ ఎలా వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

కరివేపాకులో జుట్టు ఆరోగ్యానికి ఉపయోగపడే బి బీటా కెరోటిన్ పుష్కలంగా లభిస్తుంది. ఇది జుట్టులోని మెలనిన్ ఉత్పత్తి చేసి, గ్రే హెయిర్ రాకుండా కాపాడుతుంది.
ప్యాక్ 1:
ఈ ప్యాక్ కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టి పావు లీటరు కొబ్బరినూనె తీసుకొని, అందులో గుప్పెడు కరివేపాకులు వేసి  అరగంటసేపు  బాగా ఉడికించాలి.ఇలా ఉడికించి నూనె కలర్ మారిన తర్వాత,ఆ నూనెను చల్లార్చి ఒక గాజుసీసాలో భద్రపరచుకోవాలి. ఇలా తయారు చేసుకున్న నూనెను జుట్టు కుదుల్ల నుంచి చివర్ల వరకు బాగా అప్లై చేసి,మర్ధన చేసుకోవాలి.గంట తర్వాత తలస్నానం చేస్తే సరి.ఇలా వారానికి రెండు సార్లు ఉపయోగించడం వల్ల మెలనిన్ ఊత్పత్తి పెరిగి, జుట్టు తొందరగా నల్లబడుతుంది.

ప్యాక్ 2:
 దీనికోసం గుప్పెడు కరేపాకులు తీసుకొని, అందులో 5 మందారం పూలు, మూడు స్పూన్ల కలబందగుజ్జు వేసి, బాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని మాడుకు బాగా అప్లై చేసి మర్దనా చేసుకోవాలి.ఇలా గంటసేపు ఆరిన తర్వాత మైల్డ్ షాంపుతో స్నానం చేయాలి. దీనితో మాడుపై ఉన్న పోలికల్స్ ఓపెన్ అయి,మెలనిన్ ఉత్పత్తి పెరుగుతుంది.
ప్యాక్ 3:
దీనికోసం అరకప్పు పెరుగులో గుప్పెడు కరివేపాకుల గుజ్జును కలిపి, జుట్టుకు అప్లై చేయడం వల్ల తెల్లజుట్టు నల్లబడటమే కాక చుండ్రు, జుట్టురాలడం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: