నరాల బలహీనత, తిమ్మిర్లు, నొప్పులు తగ్గాలంటే..?

Purushottham Vinay
నరాల బలహీనత సమస్యతో ఎక్కువగా బాధపడే వారు ఒక చక్కటి టిప్ ని పాటిస్తూ కొన్ని ఆహార నియమాలను పాటించడం వల్ల ఈ సమస్య నుండి చాలా ఈజీగా బయటపడవచ్చు. నరాల బలహీనతను తగ్గించే ఆ టిప్ ఏమిటి? డాన్ని ఎలా తయారు చేసుకోవాలి? ఇంకా దాని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి? వంటి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.ఇక ఈ టిప్ ని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని పోసి వేడి చేయాలి. ఆ నీళ్లు వేడయ్యాక ఇందులో అర ఇంచు దాల్చిన చెక్కను వేయాలి.అలాగే ఒక నల్ల యాలక్కాయను ఇంకా 3 లవంగాలను కచ్చా పచ్చాగా దంచి వేసుకోవాలి. తరువాత ఈ నీటిని మధ్యస్థ మంటపై అర గ్లాస్ కషాయం మిగిలే దాకా వేడి చేయాలి. ఆ తరువాత ఈ నీటిని వడకట్టి ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. తరువాత ఇందులో రుచికి తగినట్టు బెల్లాన్ని కూడా వేసి కలిపి తీసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న కషాయాన్ని రోజూ ఉదయం పూట పరగడుపున తీసుకోవాలి. దీనిని తీసుకున్న అరగంట దాకా ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు.  


లేదా బ్రేక్ ఫాస్ట్ చేసిన గంట తరువాత తీసుకోవాలి లేదా సాయంత్రం కడుపు ఖాళీగా ఉన్న సమయంలో తీసుకోవాలి. ఇలా రోజులో ఏదో ఒక సమయంలో మాత్రమే దీన్ని తీసుకోవాలి.ఈ కషాయాన్ని తాగడం వల్ల నరాల బలహీనత సమస్య తగ్గుతుంది.నరాల్లో వాపులు ఇంకా నొప్పులు తగ్గుతాయి.ఎముకలు చాలా ధృడంగా, బలంగా తయారవుతాయి.ఇంకా పోషకాహార లోపం తలెత్తకుండా ఉంటుంది. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు ఇంకా వెన్ను నొప్పి వంటి సమస్యలన్నీ తగ్గుతాయి. ఈ టిప్ పాటిస్తూనే విటమిన్ బి 12, మెగ్నీషియం, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. పాలు, పాల పదార్థాలు, గుడ్లు, చేపలు ఇంకా అలాగే పాలకూర వంటి వాటిని తీసుకోవాలి. అలాగే రాత్రంతా కూడా నానబెట్టిన వేరుశనగలను తీసుకోవాలి. ప్రతిరోజూ వ్యాయామం, యోగా వంటి వాటిని ఖచ్చితంగా చేస్తూ ఉండాలి. అలాగే నొప్పులు ఇంకా వాపులు ఉన్న చోట నూనెతో మర్దనా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కూడా ఖచ్చితంగా చాలా మంచి ఫలితం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: