ఈ టీతో కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు మాయం?

Purushottham Vinay
ఇప్పుడు చెప్పబోయే టీని తయారు చేసుకొని తాగడం వల్ల ఖచ్చితంగా కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. ఇంకా కీళ్ళ నొప్పులతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు కూడా చాలా ఈజీగా తగ్గుతాయి. ఇక ఈ టీని తయారు చేసుకోవడానికి  మనం అర టీ స్పూన్ వామును, అర టీ స్పూన్ కాళోంజి విత్తనాలను తీసుకోవాలి.తరువాత వీటిని ఒక గిన్నెలో వేసి ఒక గ్లాస్ నీటిని పోయాలి. ఆ తరువాత ఈ నీటిని మధ్యస్థ మంటపై అర గ్లాస్ అయ్యే దాకా మరిగించాలి. తరువాత ఈ నీటిని వడకట్టి ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. ఇక ఇలా తయారు చేసుకున్న టీ గోరు వెచ్చగా అయిన తరువాత ఇందులో తేనె లేదా బెల్లం వేసి కలుపుకొని తాగాలి.అయితే షుగర్ వ్యాధితో బాధపడే వారు మాత్రం ఇందులో తేనె, బెల్లం వేసుకోకపోవడమే మంచిది. ఈ విధంగా ఈ టీని తాగడం వల్ల పైన అనేక అనారోగ్య సమస్యలన్నింటిని మనం దూరం చేసుకోవచ్చు. అధిక బరువు, కొలెస్ట్రాల్, కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు ఇంకా జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్న వారు ఈ టిప్ ని ఈ విధంగా వాడడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.


అయితే ఎటువంటి సమస్యలు లేని వారు కూడా వామును ఇంకా కాళోంజి విత్తనాలను కలిపి తీసుకోవచ్చు. ఎలాంటి సమస్యలు లేని వారు పావు టీ స్పూన్ వామును, పావు టీ స్పూన్ కాళోంజి విత్తనాలను చపాతీ పిండిలో వేసి కలపాలి. తరువాత ఇలా తయారు చేసుకున్న పిండితో చపాతీలు తయారు చేసి తీసుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. ఈ విధంగా వాము, కాళోంజి విత్తనాలు మనకు చాలా మేలు చేస్తాయని ఇంకా అలాగే వీటితో టీ ని తయారు చేసుకుని తీసుకోవడం వల్ల మనం ఖచ్చితంగా చాలా రకాల అనారోగ్య సమస్యలను మన దరి చేరకుండా చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.కాబట్టి ఖచ్చితంగా ఈ టీ తయారు చేసుకొని తాగండి. అనేక రకాల అనారోగ్య సమస్యలని ఈజీగా దూరం చేసుకోండి. ఎలాంటి రోగాలు రాకుండా ఆరోగ్యంగా ఉండండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: