నిద్రలేమిని పొగట్టాలంటే ఇవి అస్సలు తినొద్దు?

Purushottham Vinay
మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా ప్రతిరోజూ కూడా కనీసం 7 నుంచి 8 గంటల నిద్రపోవడం చాలా ముఖ్యం. కంటికి సరిపడా నిద్రపోవడం వల్ల మానసికంగా ఇంకా అలాగే శారీరకంగా చాలా ఆరోగ్యంగా ఉండొచ్చు.నిద్రలేమి సమస్య అనేది ఖచ్చితంగా ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది.ఇక ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రాత్రి నిద్రపోకపోవడానికి చాలా రకాల కారణాలు ఉండవచ్చు. వాటిలో మొబైల్ వాడకం అనేది ప్రధానమైంది.ఇంకా అంతే కాకుండా పడుకునే ముందు టీ, కాఫీ ఇంకా ఆల్కహాల్ వంటివి తీసుకోవడం వల్ల కూడా సరిగ్గా నిద్ర పట్టదు. అందుకే మీరు రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోవాలనుకుంటే ఈ ఆహారాలు మాత్రం అస్సలు తినొద్దని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.ఇక అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.అయితే చాలా మందికి కూడా రాత్రి పడుకునే ముందు కాఫీ తాగే అలవాటు ఎక్కువగా ఉంటుంది.ఇక మీకు కూడా రాత్రి పడుకునే ముందు కాఫీ తాగే అలవాటు ఉంటే.. వెంటనే ఆ అలవాటుని మానేయండి. లేదంటే అసలు రాత్రిళ్లు నిద్ర పట్టదు.ఇంకా అలాగే రాత్రిపూట వేయించిన పదార్థాలను అస్సలు తినొద్దు.


ఎందుకంటే రాత్రిపూట వాటిని తినడం వల్ల జీవక్రియ ఖచ్చితంగా నెమ్మదిస్తుంది. ఫలితంగా తిన్న ఆహారం అరగడానికి నిద్రకు భంగం కూడా కలుగుతుంది.అందుకే రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ వేయించిన ఆహారాలకు దూరంగా ఉండాలి.మీరు ప్రశాంతంగా నిద్రపోవాలంటే ఖచ్చితంగా రాత్రిపూట ఐస్ క్రీమ్ తినకుండా ఉండాలి. ఐఎస్ క్రీమ్ తినడం వల్ల కార్టిసాల్ హార్మోన్‌ను పెంచుతుంది. ఈ కారణంగా రాత్రి నిద్ర, ప్రశాంతత రెండూ కూడా మాయం అవుతాయి. అందుకే రాత్రివేళ ఐస్ క్రీమ్ మాత్రం అస్సలు తినొద్దు.ఇంకా అలాగే రాత్రిపూట వెన్న, చీజ్ తినకూడదు. రాత్రి వేళ దీనిని తినడం వలన నిద్రలో ఖచ్చితంగా ఆటంకాలు ఏర్పడుతాయి. అందుకే వెన్నను పగటిపూట మాత్రమే తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.అలాగే రాత్రి పడుకునేటప్పుడు సిట్రస్ పండ్లను కూడా అస్సలు తినకూడదు. వీటిలో ఉండే ఆక్సాలిక్ యాసిడ్ నిద్రకు ఖచ్చితంగా భంగం కలిగిస్తుంది. అలాగే కెచప్, ఫ్రైస్ కూడా అస్సలు తినకూడదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: