పిల్లలకు మైదాపిండి వంటకాలు.. తినిపించకూడదా..?

Divya
ఈ మధ్య చిన్న పిల్లలకు స్నాక్ రూపంలో మైదా పిండితో తయారు చేసిన బిస్కెట్స్, పిజా, బర్గర్ వంటివి ఎక్కువగా ఇస్తుంటారు.కానీ మనం తీసుకున్న ఆహారం జీర్ణం అవడానికి అందులో తగిన ఫైబర్ వుండాలి. లేకుంటే కడుపులోని పేగులు దెబ్బతింటాయి.మరియు ఫైబర్ లేని మైదాపిండిని తీసుకుంటే మాత్రం జీర్ణ వ్యవస్థ పనితీరు మందగిస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.వీటివల్ల కలిగే దుస్ప్రభావాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
వీటితో తయారు చేసిన ఆహార పదార్థాలు,ఎక్కువగా తీసుకోవడం వల్ల, ఇతర పదార్థాలను జీర్ణం కాకుండా చేస్తాయి. దీనితో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోయి పేగులకు అలాగే అతుక్కుపోయి,అక్కడే హాని చేసే క్రిములు ఉత్పత్తి పెరుగుతుంది. అవి క్రమంగా ఇన్ఫెక్షన్లకు దారి తీసి, దీర్ఘకాలీక రోగాలయినా ఆపేండిక్స్,క్యాన్సర్ వంటి రోగాలు కలిగే అవకాశాలను పెంచుతాయి.
 
మైదాపిండితో చేసిన వంటకాలు అధికంగా తీసుకోవడం ద్వారా, అవి సక్రమంగా జీర్ణం కాక కిడ్నీలో రాళ్లను ఏర్పరుస్తాయి. వీటిని తరచూ తీసుకోవడం వల్ల, చెడు కొలెస్ట్రాల్ పెరిగి, ఊబకాయం వస్తుంది. అధిక బరువు తగ్గాలనుకునేవారు వీటికి దూరంగా ఉండటం చాలా మంచిది. మైదా పిండిలోని అధిక గ్లూటెన్ వల్ల గుండె సంబంధిత కండరాలు బలహీనపడి,గుండె సమస్యలకు దారి తీస్తాయి. ఇందులోని క్లైకమిక్ ఇండెక్స్ ఎక్కువగా వుండటం వల్ల శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
సాధారణంగా మనం తీసుకొనే గోదుమ పిండితో పోల్చితే చౌకగా లభించే మైదాను ప్రస్తుతం బేకరీ మరియు హోటల్ లలో తయారు చేసే ఆహారల్లో అధికంగా ఉపయోగిస్తున్నారు. కావున చిన్న పిల్లలు బయట ఆహారాలు పెట్టకపోవడం ఆరోగ్యానికి చాలా మంచిదని  ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.మరియు అధిక పోషకాలు కలిగిన మన సాంప్రదాయ వంటలు, రుచికరంగా వండిపేట్టాలి. దీనితో పాటు అరగంట సేపు నడక,వ్యాయామం, బయట ఆడుకోవడం వంటివి చేయడం అలవాటు చేయాలి.మరియు వారిని అవుట్ డోర్ గేమ్స్ ఆడటానికి ప్రోత్సాహించాలి.దీనితో వారి పెరుగుదల సక్రమంగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: