లివర్లో పేరుకుపోయిన చెత్తంతా పోవాలంటే?

Purushottham Vinay
ఈ కాలంలో మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్ల వల్ల మనలో చాలా మంది కూడా కాలేయ సంబంధిత సమస్యలతో చాలా ఎక్కువగా బాధపడుతున్నారు.కాలేయంలో మలినాలు ఇంకా అలాగే విష పదార్థాలు పేరుకుపోయి కాలేయ ఆరోగ్యం చాలా తీవ్రంగా దెబ్బతింటుంది. అందువల్ల కాలేయ సంబంధిత సమస్యలతో పాటు వివిధ రకాల అనారోగ్య సమస్యల బారిన కూడా పడుతున్నారు.ఇలా కాలేయ సంబంధిత సమస్యల బారిన పడకుండా ఉండాలంటే మనం ఎల్లప్పుడూ కూడా మన కాలేయంలో మలినాలు పేరుకుపోకుండా చూసుకోవాలి. కాలేయాన్ని ఎల్లప్పుడూ బాగా శుభ్రంగా ఉంచుకోవాలి. ఎలాంటి ఖర్చు లేకుండా కేవలం మన ఇంట్లో ఉండే పదార్థాలతో ఒక ఆరోగ్యకరమైన పానీయాన్ని తయారు చేసుకుని తాగడం వల్ల మనం కాలేయంలో పేరుకుపోయిన మలినాలన్నింటిని చాలా ఈజీగా తొలగించుకోవచ్చు. 


ఈ పానీయాన్ని తాగడం వల్ల కాలేయం శుభ్రపడడంతో పాటు చాలా ఆరోగ్యంగా కూడా పని చేస్తుంది.ఇంకా ఈ పానీయాన్ని తయారు చేసుకోవడానికి  మనం సొరకాయ, కొత్తిమీర, పసుపు, నిమ్మకాయ, నల్ల ఉప్పు అలాగే తిప్పతీగ రసాన్ని( గిలోయ్ రసాన్ని) ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక జార్ లో సొరకాయ ముక్కలు, కొత్తిమీర ఇంకా ముప్పావు గ్లాస్ నీళ్లు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక గ్లాస్ లోకి తీసుకుని అందులో ఒక టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ నల్ల ఉప్పు, ఒక టీ స్పూన్ నిమ్మరసం ఇంకా అలాగే 30 ఎమ్ ఎల్ తిప్ప తీగ రసం వేసి బాగా కలపాలి. ఇలా తయారు చేసుకున్న పానీయాన్ని ప్రతి రోజూ ఉదయం పూట పరగడుపున తాగాలి. ఇలా తాగడం వల్ల కొద్ది రోజుల్లో మన కాలేయం బాగా శుభ్రపడుతుంది.కాలేయంలో పేరుకుపోయిన మలినాలన్నీ చాలా ఈజీగా తొలగిపోతాయి.కాబట్టి ఖచ్చితంగా ఈ పానీయం తాగండి. లివర్ ని ఆరోగ్యంగా ఉంచుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: