పుచ్చకాయ గింజలు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..!

shami
వేసవి కాలంలో మనం ఎక్కువగా తీసుకునే ఫ్రూట్ ఏదైనా ఉంది అంటే అది వాటర్ మిలన్ మాత్రమే. పుచ్చకాయ అంటే చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరు ఇష్టపడతారు. వేసవి కాలంలో ఈ పుచ్చకాయలను ఎక్కువ గా తీసుకోవడం వల్ల మంచి ఆరోగ్యంతో పాటుగా ఎండ వేడిని తట్టుకునే శక్తి కూడా వస్తుంది. అయితే పుచ్చకాయలే కాదు పుచ్చ గింజలు కూడా ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. పుచ్చకాయలో కన్నా పుచ్చ గింజల్లోనే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట. ఇంతకీ పుచ్చ గింజల వల్ల లాభాలు ఏంటి అంటే..
మగవారికి పుచ్చ గింజలు మంచి బలాన్ని ఇస్తాయట. అంతేకాదు స్పెర్మ్ కౌంట్ పెరగడానికి కూడా ఈ పుచ్చ గింజలు ఉపయోగపడతాయని తెలుస్తుంది. ఇక ఈ పుచ్చకాయ గింజలలో ఉండే సెలీనియం, పొటాషియం, జింక్, కాపర్ లాంటి పోషక పదార్ధాల వల్ల అనారోగ్య బారిన పడకుండా ఉంటారని తెలుస్తుంది. పుచ్చ గింజల్లో ఉండే సెట్రులిన్ వల్ల రక్త ప్రసరణ బాగుంటుందని చెబుతున్నారు.
ఇవేకాకుండా పుచ్చకాయ గింజల్లో మాంగనీస్, లసిన్, గ్లూటామిక్ యాసిడ్, లైకోపీన్, ఆర్జినిన్ లు ఉంటాయట. ఇవి జీర్ణక్రియను గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరి పుచ్చకాయ తిన్న తర్వాత పుచ్చ గింజలను పరేయకుండా వాటిని ఎండబెట్టి పైన పొట్టు తీసి తీసుకుంటే వాటి వల్ల ఎన్నో మంచి ప్రయోజనాలు ఉన్నాయని తెలుస్తుంది. పుచ్చ గింజలతో కాంబినేషన్ గా సన్ ఫ్లవర్ సీడ్స్, గుమ్మడి గింజల ను కూడా తీసుకుంటే ఇంకా బెటర్ సొల్యూషన్స్ ఉంటాయని అంటున్నారు. ముఖ్యంగా పిల్లలకు పుచ్చకాయలు.. పుచ్చ గింజలు ఎంతోమంచి బలాన్ని ఇస్తాయని అంటున్నారు. పుచ్చకాయలు మాత్రమే తిని గింజలను బయట పడేయకుండా ఈసారి ఆ గింజలను కూడా తీసుకుని వాడుకుంటే బెటర్ అని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: