గుడ్డు తింటే గుండె ఆరోగ్యం భద్రం?

Purushottham Vinay
గుడ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో విటమిన్ బి2, విటమిన్ బి12, సెలీనియం వంటివి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి కనుక శరీరంలో లోపిస్తే హోమోసిస్టీన్ అనే అమైనో యాసిడ్ పెరుగుదలకు కారణమవుతుంది. ఇది దమనుల్లో ఫలకం ఏర్పడే ప్రమాదాన్ని ఈజీగా పెంచుతుంది. ఇంకా అలాగే సెలీనియం యాంటీఆక్సిడెంట్‌గా కూడా పనిచేస్తుంది. దీంతో గుండె జబ్బులను నివారించడంలో ఎంతగానో సహాయపడుతుంది. గుండె రోగులు ప్రాసెస్డ్ ఫుడ్‌కు చాలా దూరంగా ఉండాలి. అందుకే కచ్చితంగా గుడ్డు తీసుకుంటే మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాగే ఎప్పుడు గుడ్లను ఉడకబెట్టి తీసుకోవడం మీకు ఇష్టం లేకుంటే ఇతర ఆహారాలతో కలిపి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే ఆమ్లెట్‌లా అయినా వేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మొత్తానికి శరీరానికి సంతృప్త కొవ్వులను అందించడానికి కచ్చితంగా గుడ్డు వినియోగం ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇవి గుడ్లల్లో చాలా ఎక్కువగా ఉండడం వల్ల వారానికి 1-3 లేదా 1-7 గుడ్లు కచ్చితంగా తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇలా తినడం ద్వారా వారానికి 1.6 గ్రాముల నుంచి 11.6 గ్రాముల సంతృప్త కొవ్వును శరీరానికి ఈజీగా అందించవచ్చు.


 ప్రతిరోజు శరీరానికి 2000 క్యాలరీల ఆహారం కనుక అందిస్తే 13 గ్రాముల సంతృప్త కొవ్వు మీకు అందుతుంది. అయితే గుడ్లను వ్యక్తి  ఆరోగ్య పరిస్థితిని బట్టి గుడ్లని పరిమితంగా తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.ఇక ఈ మధ్య వెల్లడైన ఓ అధ్యయనం ప్రకారం వారానికి రెండు నుంచి మూడు గుడ్లు తినడం వల్ల గుండె సంబంధిత సమస్యలు 60 శాతం తగ్గాయని వెల్లడైంది. అలాగే నాలుగు నుంచి ఏడు గుడ్లు తిన్నవారు 75 శాతం మేర గుండె సమస్యలు ఈజీగా తగ్గించుకోగలిగారు. దాదాపు మొత్తం 3042 మందిపై చేసిన పరిశోధనల్లో ఈ విషయం తేలింది. గుడ్డు వినియోగం, కార్డియోవాస్కులర్ డిసీజ్, కార్డియోమెటబోలిక్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఇంకా ది ఇంటరాక్షన్ విత్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనే పేరుతో జరిగిన ఈ అధ్యయనానికి గ్రీస్‌లోని పోషకాహార పరిశోధకులు ఇంకా అలాగే డేటా శాస్త్రవేత్తల బృందం నాయకత్వం వహించింది. గుండెకు ఆరోగ్యకరమైన ఆహారారలో గుడ్లకు ప్రత్యేకమైన స్థానం ఉందని, మొత్తం సంతృప్త కొవ్వు తీసుకోవడం ద్వారా గుండె ఆరోగ్యం బాగా మెరుగు అవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: