వంట గదిలోని గ్యాస్ స్టవ్ తో ఆస్తమా రావడం ఖాయం..!

Divya
సాధారణంగా గ్యాస్ స్టవ్ లు ఈమధ్య వచ్చాయి కానీ పూర్వకాలంలో అయితే చాలామంది కట్టెల పొయ్యి మీదనే వంట చేసేవారు. అంతేకాదు కట్టెల పొయ్యి అనేది వారి ఆర్థిక స్తోమత ప్రకారమే కాదు మారని కాలం
. లేని సౌకర్యాలు కారణంగా ఎంత పెద్ద వారైనా సరే తమ ఇంట్లో కట్టెల పొయ్యి ద్వారానే వంటలు వండుకునేవారు.  కానీ కాలం మారుతున్న కొద్ది సౌకర్యాల విషయంలో కూడా ఎన్నో మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా వంటగదిలోకి కూడా కొత్త రకమైన గ్యాస్ స్టవ్ అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా వంట క్షణాల్లోనే అయిపోతుంది. తక్కువ ఖర్చు శ్రమ కూడా తక్కువ.. కాబట్టి ప్రతి ఒక్కరూ గ్యాస్ స్టవ్ పైనే వంట చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.  కానీ ఈ గ్యాస్ స్టవ్ అనేది ప్రాణాంతక వ్యాధులను తీసుకొస్తోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు..
తాజాగా ఇండోర్ గ్యాస్ స్టవ్ నుంచి వెలువడే వాయువు ఉద్గారాలు మానవ చేటు చేస్తున్నాయని క్యాలిఫోర్నియా ఎయిర్ రిసోర్సెస్ బోర్డ్ అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. గ్యాస్ స్టవ్ వెలిగించేటప్పుడు జాగ్రత్తలు లేకపోతే మాత్రం ఎన్నో ప్రమాదాలు జరుగుతాయి.  గ్యాస్ స్టవ్ నుంచి విడుదలయ్యే విషవాయువులు పొల్యూషన్ కి కూడా కారణమవుతున్నాయి. గ్యాస్ స్టవ్ నుంచి వెలువడే వాయు కాలుష్య కారకాలలో నైట్రోజన్ డయాక్సైడ్ కూడా ఒకటి.. దీనివల్ల పిల్లలలో ఆస్తమా వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
సాధారణంగా నైట్రోజన్ డయాక్సైడ్ ఇంధన దహనంలో ఉప ఉత్పత్తి ఇళ్లలో గ్యాస్ ద్వారా విడుదలయ్యే ఇది ఎక్స్పోజర్స్ గా పనిచేస్తాయి ముఖ్యంగా ఈ వాయువుతో ఆస్తమా పెరిగే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు.. దీని ద్వారా దీర్ఘకాలిక అబ్ స్టకివ్ పల్మనరీ డిసీజ్ను అభివృద్ధి చేస్తోంది. బయట నుంచి వచ్చే గాలి కాలుష్యం వల్లే మనం అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నామని అనుకుంటాం కానీ ఇంట్లోనే కాలుష్యాన్ని పోషిస్తున్నామన్న సంగతి ఎవరూ గమనించడం లేదు ముఖ్యంగా ఇండోర్ నైట్రోజన్ డయాక్సైడ్ స్థాయిలకు గ్యాస్ ట్రౌస్ ఎక్కువగా కారణం అవుతున్నాయి. కాబట్టి గ్యాస్ స్టవ్ వాడేవారు తమ కిచెన్ లో వాయువులు బయటికి పోయే విధంగా వెంటిలేషన్ ఏర్పాట్లు చేస్తే సమస్య తప్పించి తప్పించుకోవచ్చు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: