ఆరోగ్యానికి అమృతం లాంటి పొడి..?

Purushottham Vinay
ముందుగా ఒక జార్ లో నువ్వులు, గసగసాలు ఇంకా అలాగే బాదం పప్పులను తీసుకుని వాటిని బాగా పొడిగా చేసుకోవాలి.ఆ తరువాత ఈ పొడిని గాలి తగలకుండా స్టోర్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న పొడిని పిల్లలు ఒక టీ స్పూన్ మోతాదులో ఇంకా పెద్దవారు అయితే రెండు టీ స్పూన్ల మోతాదులో తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల మనం చాలా రకాలం ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. ఈ పొడిని పాలతో లేదా నీళ్లతో మనం తీసుకోవచ్చు. ముందుగా మీరు ఒక గిన్నెలో ఒక గ్లాస్ ఆవు పాలను తీసుకుని వేడి చేయాలి. ఆ పాలు వేడయ్యాక ఈ పొడిని రెండు టీ స్పూన్ల మోతాదులో వేసి కలపాలి. తరువాత ఆ పాలను మరో 3 నిమిషాల పాటు కొంచెం సేపు మరిగించాలి. ఇక ఆ పాలు మరిగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి వాటిని కొద్దిగా చల్లారనివ్వాలి.ఈ పాలు చల్లారిన తరువాత రుచికి తగినంత బెల్లాన్ని కూడా వేసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న పాలను ప్రతి రోజూ ఉదయం అల్పాహారంలో భాగంగా లేదా రాత్రి పడుకునే ముందు తాగాలి.ఇంకా రాత్రి సమయంలో తీసుకోవడం చాలా మంచిది.అయితే బెల్లానికి బదులుగా ఇందులో పటిక బెల్లాన్ని కూడా వేసుకోవచ్చు.


ఇక పాలు ఇష్టం లేని వారు ఈ పొడిని రెండు టీ స్పూన్ల మోతాదులో గోరు వెచ్చని నీళ్లల్లో వేసి కలిపి తాగవచ్చు. ఈ విధంగా రోజూ రాత్రి పాలతో కలిపి ఈ పొడిని తీసుకోవడం వల్ల చాలా చక్కగా నిద్ర వస్తుంది.తద్వారా నిద్ర లేమి సమస్య దూరం అవుతుంది. ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. ఇంకా అలాగే శరీరంలో క్యాల్షియం లోపం తలెత్తకుండా ఉంటుంది. కీళ్ల నొప్పులు ఇంకా కండరాల నొప్పులు తగ్గుతాయి. జీర్ణ వ్యవస్థ కూడా బాగా మెరుగుపడుతుంది. మతిమరుపు వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. మెదడు పనితీరు కూడా బాగా మెరుగుపడుతుంది. అలాగే రక్తహీనత సమస్య కూడా ఈజీగా తగ్గుతుంది.ఇంకా శరీరానికి కావల్సిన పోషకాలు లభిస్తాయి. శరీరానికి తగినంత శక్తి కూడా లభిస్తుంది. నీరసం, బలహీనత వంటి సమస్యలు చాలా ఈజీగా తగ్గుతాయి. అలాగే రోజంతా ఉత్సాహంగా పని చేసుకోవచ్చు. ఈ విధంగా నువ్వులు, గసగసాలు, బాదం పప్పును పొడిగా చేసుకుని పాలతో కలిపి తీసుకోవడం వల్ల ఎన్నో రకాలం అనారోగ్య సమస్యలను చాలా సులభంగా దూరం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: