బాదం పొట్టు ఆరోగ్యానికి అందానికి ఎంత మంచిదంటే?

Purushottham Vinay
చాలా మంది కూడా బాదం పప్పు  తినేటప్పుడు వాటి తొక్కలను తీసి పారేస్తుంటారు. కానీ.. అలా చేయడం ఏమాత్రం సరికాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే ఈ బాదం పొట్టు అనేది ఆరోగ్యానికి చాలా విధాలుగా ఉపయోగపడతాయి. కాబట్టి బాదం పొట్టును తీయకుండా దాన్ని తినడమే ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ బాదం తొక్కను మొక్కలకు ఎరువుగా కూడా మనం ఉపయోగించవచ్చు. ఇక బాదం తొక్కలోని యాంటీఆక్సిడెంట్, యాంటీమైక్రోబయల్, యాంటీవైరల్, ప్రీబయోటిక్ లక్షణాలు మొక్కల మెటాబోలైట్స్ ఇంకా విటమిన్ ఇ ను ఈజీగా పెంచుతాయి. ఈ బాదం తొక్కను కంపోస్ట్‌గా తయారు చేయడానికి, ముందుగా బాదం తొక్కలను తీసుకొని వాటిని ఎండలో బాగా ఆరబెట్టాలి. ఆ తర్వాత బాగా మెత్తగా  రుబ్బుకోవాలి. ఇక ఇప్పుడు బాదం తొక్కతో తయారు చేసిన పొడిని మొక్కల వేర్ల దగ్గర మీరు అప్లై చేయాలి.బాదం తొక్కను నేరుగా తినకూడదనుకునే వారు దానిని చాలా రకాలుగా తినవచ్చు. మీరు ఈ బాదం తొక్కను చట్నీ రూపంలో కూడా తినవచ్చు. ఇందు కోసం బాదం పొట్టును తీసుకొని రాత్రంతా కూడా బాగా నానబెట్టాలి. ఇంకా ఆ తర్వాత వేరుశనగలు వేయించి, బాదం తొక్కతో పాటు బాగా రుబ్బుకోవాలి.


ఆ తర్వాత వేడి పాన్‌లో నూనె పోసి అందులో కొద్దిగా ఉల్లిపాయ, మిరియాల పొడి ఇంకా అలాగే జీలకర్ర వేసి బాగా వేగించాలి. అది చల్లారిన తర్వాత ఈ మిశ్రమంలో బాదం తొక్క ఇంకా వేరుశనగలు వేసి తగినంత ఉప్పు ఇంకా అలాగే చింతపండు రసం కలపాలి.ఇక చివరగా ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి తరువాత బాదం చట్నీతో కలపాలి.ఇంకా అలాగే బాదంపప్పు తొక్కతో చేసిన బాడీ వాష్ యాంటీ ఏజింగ్ లక్షణాల సహాయంతో చర్మాన్ని తేమగా, మృదువుగా ఉంచడంలో చాలా బాగా సహాయపడుతుంది. ఇందుకోసం మీరు 1 టేబుల్ స్పూన్ బాదంపప్పు పొట్టుకు 2 టేబుల్ స్పూన్ల పాలు, 1 టేబుల్ స్పూన్ పసుపు, కొద్దిగా రోజ్ వాటర్ ఇంకా అలాగే తేనె కలిపి 5 నిమిషాలు పాటు నానబెట్టాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాడీ స్క్రబ్ ఇంకా అలాగే ఫేస్ ప్యాక్ లాగా అప్లై చేయాలి. మనకు ప్రకృతి సిద్ధంగా లభించే పదార్థాలలో బాదంపప్పును మంచి ఉదాహరణగా చెప్పవచ్చు.కాబట్టి దీనివల్ల కలిగే ఉపయోగాలను ఖచ్చితంగా వినియోగించుకోండి. అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఖచ్చితంగా పొందండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: