చింత గింజల వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా..?

Divya
రుచికి పుల్లగా ఉండే చింతపండులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న సంగతి మనకు తెలిసిందే. కానీ మనం వృధాగా పారవేసే ఈ చింతగింజలలో అద్భుతమైన ఔషధ గుణాలు మెండుగా ఉన్నాయని మీకు తెలుసా...?
చింత గింజల్లో ప్రోటీన్స్,ఎమినో ఆమ్లాలు, ఫ్యాటీ ఆమ్లాలు, మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి.అంతే కాకుండా చింత గింజల్లో మన శరీరాన్ని అనేక ఇన్ఫెక్షన్ల నుండి కాపాడే గుణాలు పుష్కలంగా ఉన్నాయి.చింత గింజల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. వాతావరణ మార్పుల వలన వచ్చే గొంతు నొప్పికి ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొద్దిగా చింత గింజల పొడి వేసి పుక్కిట పడితే మంచిది.
జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచే అద్భుత లక్షణాలు చింతగింజల్లో దాగి ఉన్నాయి. ఇందులో ఉండే ఫైబర్ యాసిడ్ ఉత్పత్తిని పెంచి తీసుకున్న ఆహారం తేలికగా జీర్ణం అయ్యేందుకు సహాయపడతాయి. చింత గింజల్లో మన శరీరంలో ఇమ్యూనిటీ పవర్ ను పెంచే గుణాలు పుష్కలంగా ఉన్నాయి.ఇది రక్తంలోని హిమోగ్లోబిన్ శాతాన్ని,ఎర్ర రక్త కణాలను వృద్ధి చేయడంతో పాటు ప్లేట్లెట్స్ ను మెరుగు పరుస్తాయి.
చింత గింజల పొడిని పళ్ళూ, చిగుళ్ళ మీద రుద్దడం వల్ల మేలు జరుగుతుంది.ప్రత్యేకించి పొగ తాగే అలవాటున్న వారికి ఇది మరీ మంచిది. స్మోక్ చేయడం, ఎక్కువగా సాఫ్ట్ డ్రింక్స్ తాగడం వల్ల పంటి మీద గార వస్తుంది.అందువల్ల చింత గింజల పొడితో వారం లో రెండు లేదా మూడు సార్లు కనుక పళ్ళు తోమితే  పంటి మీద ఉన్న గార తొలగిపోతుంది.
కీళ్ల నొప్పులకు చింత గింజలు పెట్టింది పేరు.జాయింట్ పెయింట్స్ నుండి ఉపశమనం కలిగిస్థాయి. కీళ్ల నొప్పులతో బాధపడేవారు చింత గింజల పొడిని ఒక గ్లాస్ నీటితో కలిపి తీసుకున్నట్లయితే మంచి ఫలితం ఉంటుంది. ప్రకృతి ద్వారా లభించే ఏదీ కూడా వృధా కాదు అయితే దానిని ఎలా ఉపయోగించాలో తెలిసినప్పుడే..దాని  యొక్క పూర్తి ఉపయోగం తెలుస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: