ఎండు కొబ్బరి లడ్డుతో ఈ రోగాలన్నీ పరార్..!

Divya

ఇటీవల కాలంలో చాలామంది ఆధునిక జీవనశైలి విధానాన్ని అనుసరించి తీవ్ర అనారోగ్య సమస్యలను కూడా ఎదుర్కొనే దుస్థికి చేరుకున్నారు. మరి కొంతమంది ప్రజలు ఏకంగా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు.  ఇంకొంతమంది రక్తపోటు,  నరాల బలహీనత,  రక్తహీనత వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. దీనికోసం ఆయుర్వేద నిపుణులు సూచించిన ఔషధాలు కలిగిన కొన్ని రకాల లడ్డూలను తినడం వల్ల ఎటువంటి రోగాల నుంచి బయటపడవచ్చు అని సమాచారం.. కాబట్టి ఈ ఔషధ గుణాలు కలిగిన లడ్డును రుచిగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఒకసారి చూసి తెలుసుకుందాం.
ఎండు కొబ్బరి లడ్డును రుచిగా తయారు చేయాలి అంటే దానికి కావలసిన పదార్థాలు ఏంటంటే.. ముందుగా ఒక అర కప్పు బెల్లం తురుము.. అర కప్పు నెయ్యి , అర కప్పు గోధుమపిండి , పావు కప్పు యాలకులు, పావు కప్పు పిస్తా,  బాదం,  డ్రైఫ్రూట్స్, పుచ్చకాయ విత్తనాలు, ఒక కప్పు కొబ్బరి తురుము, ఒక కప్పు ఎండు ఖర్జూరాలు, నాలుగు యాలకులు తీసుకోవాలి.. ముందుగా స్టవ్ వెలిగించి దానిపై ఒక బౌల్ పెట్టి ఎండు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి బౌల్లో వేసి మంచి సువాసన వచ్చేవరకు వేయించాలి.. వేయించిన కొబ్బరి ముక్కలను ఆ తర్వాత మిక్సీలో వేసి ఫైన్ గా పేస్ట్ చేసి అదే వేడి చేసిన బౌల్లో,  డ్రై ఫ్రూట్స్,  యాలకులను కూడా వాసన వచ్చేవరకు వేయించి అన్నింటిని మిక్సీలో వేసి ఫైన్ పేస్ట్ చేసుకోవాలి.
ఇప్పుడు స్టవ్ పైన ఇంకొక బౌల్ పెట్టి గోధుమ పిండిని రెండు నిమిషాలు వేయించి.. వేయించేటప్పుడు నెయ్యి వేస్తూ బాగా కలుపుతూ.. మంచి రంగులో వచ్చేటట్లు కలుపుతూ ఉండాలి. అలాగే వేయించిన పిండిలో డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి.. తర్వాత స్టవ్ పైన ఇంకొక బౌల్ పెట్టి అందులో రెండు చెంచాల నెయ్యి వేసి.. బెల్లం తురుము వేసి.. ఎలాంటి ఉండలు లేకుండా పూర్తిగా కరిగించాలి..  ఆ తర్వాత లడ్డు పాకం వచ్చేదాకా బెల్లం మిశ్రమాన్ని కలిపి ఆ మిశ్రమంలో వేయించి పెట్టుకున్న అన్నింటిని బాగా కలపాలి.  తర్వాత కొబ్బరి చల్లుతూ చిన్న లడ్డు లాగా తయారు చేయాలి. దీనిని ప్రతి రోజు తినడం వల్ల రక్తహీనత , రక్తపోటు లాంటి సమస్యలు కూడా దూరం అవుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: