ఈ బెర్రిలు ఆరోగ్యానికి ఎంత మంచివంటే?

Purushottham Vinay
ఆరోగ్యానికి మేలు చేసే పండ్లల్లో ఖచ్చితంగా రోవాన్ బెర్రీలు కూడా ఒకటి. ఇక ఈ బెర్రీలు ఆపిల్ కుటుంబానికి చెందినవి. ఇవి హియాలయాల్లో, పశ్చిమ చైనా, దక్షిణ టిబెట్ ఇంకా అలాగే చల్లని సమశీతోష్ణ ప్రాంతాల్లో ఈ రోవన్ బెర్రీ చెట్టు ఎక్కువగా పెరుగుతాయి.ఈ రోవాన్ బెర్రీలను ఎక్కువగా శీతాకాలంలో  తీసుకోవాలి. ఇందులో  మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మనం చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలను ఈజీగా సొంతం చేసుకోవచ్చు. రోవాన్ బెర్రీలల్లో విటమిన్ సి, సోర్బిక్ ఆమ్లం, ఫైబర్, టానిన్లు ఇంకా అలాగే ఆంథోసైనిన్స్ వంటి పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల మనం పలు రకాల క్యాన్సర్ ల బారిన పడే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి.ఈ రోవాన్ బెర్రీలను ఎక్కువగా తినడం వల్ల గుండె ఆరోగ్యం కూడా చాలా మెరుగుపడుతుంది.అలాగే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వాతావరణంలో మార్పుల కారణంగా వచ్చే జలుబు ఇంకా దగ్గు వంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.ఇంకా అంతేకాకుండా వీటిని తీసుకోవడం వల్ల కంటి చూపు కూడా బాగా మెరుగుపడుతుంది.


వీటివల్ల కళ్లకు సంబంధించిన వివిధ రకాల సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. ఇంకా అలాగే చర్మాన్ని సంరక్షించడంలో, జీర్ణ సంబంధిత సమస్యలైనా గ్యాస్, మలబద్దకం, అజీర్తి ఇంకా కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గించడంలో అలాగే జీర్ణ శక్తిని మెరుగుపరచడంలో కూడా ఈ పండ్లు మనకు ఎంతగానో సహాయపడతాయి. ఇంకా అంతేకాకుండా స్త్రీలు ఈ రోవాన్ బెర్రీలను తినడం వల్ల నెలసరి సమయంలో వచ్చే నొప్పుల నుండి కూడా చాలా ఈజీగా ఉపశమనం కలుగుతుంది.ఇక ఈ పండ్లను తినడం వల్ల మూత్రపిండాల ఆరోగ్యం కూడా బాగా మెరుగుపడుతుంది. మూత్రపిండాల్లో రాళ్లు, మూత్రంలో మంట ఇంకా అలాగే ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు తగ్గుతాయి. కేవలం ఈ పండ్లే కాకుండా ఈ చెట్టు ఆకులు, బెరడు కూడా మంచి ఔషధ గుణాలను కలిగి ఉన్నాయి. ఈ రోవాన్ బెర్రీలు మనకు డ్రై ఫ్రూట్ రూపంలో కూడా మార్కెట్ లో దొరుకుతాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసి ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనం ఖచ్చితంగా చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: