పాదాల నొప్పి తగ్గే సూపర్ టిప్స్?

Purushottham Vinay
పాదాల నొప్పి కారణంగా రోజంతా చాలా సార్లు అలసట ఉంటుంది. ఈ నొప్పిని నిర్లక్ష్యం చేస్తే నొప్పి ఎక్కువగా మారే ప్రమాదం ఉంది. పాదాల నొప్పి నుండి విముక్తి పొందడానికి మీరు ఇంటి చిట్కాలను పాటిస్తే చాలా మంచిదంటున్నారు ఆయుర్వేద నిపుణులు.పాదాల నొప్పి తగ్గాలంటే ప్రతిరోజూ కూడా ఖచ్చితంగా యోగా చేయండి. ఎందుకంటే రోజూ యోగా చేయడం ద్వారా మీరు పాదాల నొప్పి నుండి చాలా ఈజీగా ఉపశమనం పొందుతారు. యోగా చేయడం వల్ల మన శరీరంలో రక్తప్రసరణ బాగా జరిగి శరీరం చాలా యాక్టివ్‌గా మారుతుంది. మీ పాదాలలో లేదా మీ శరీరంలో ఎక్కడైనా నొప్పి ఉంటే యోగాను మీ దినచర్యలో ఖచ్చితంగా ఒక భాగంగా చేసుకోండి.ఇంకా అలాగే మీరు కాలు తిమ్మిరిని తగ్గించడానికి బౌండ్ యాంగిల్, డాల్ఫిన్ ఇంకా ఈగిల్ లేదా ఎక్స్‌టెండెడ్ సైడ్ యాంగిల్ అన్ని కూడా ట్రై చేయవచ్చు.అలాగే మెంతులు కూడా మంచివి. ఇవి యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ప్లిమెటరీ లక్షణాలను కలిగి ఉంటాయి.అందువల్ల ఇది మంచి నొప్పి నివారిణిగా పనిచేస్తుంది.


ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఒక చెంచా మెంతులను తీసుకొని వాటిని నానబెట్టి రాత్రంతా ఉంచాలి.తరువాత ఉదయాన్నే లేచి ఖాళీ కడుపుతో ఆ నీటిని తాగాలి. ఇలా రోజుకు ఒకటి లేదా రెండుసార్లు ఒక చెంచా మెంతి గింజలను కూడా నమలవచ్చు. ఇలా చేయడం వల్ల పాదాల నొప్పులను చాలా ఈజీగా దూరం చేసుకోవచ్చు.ఇంకా అలాగే ఆపిల్ సైడర్ వెనిగర్ కూడా పాదాల నొప్పిని తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో అనాల్జేసిక్ గుణాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది పాదాలలో వాపు ఇంకా నొప్పిని తగ్గించడంలో ఎంతగానో సహాయపడుతుంది. మీరు ఒక కప్పులో రెండు టీస్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ ఇంకా అలాగే అర టీస్పూన్ తేనె కలిపి ఖాళీ కడుపుతో తాగవచ్చు. ఇలా చేయడం వల్ల నొప్పి నుంచి చాలా ఈజీగా ఉపశమనం లభిస్తుంది.ఇంకా అలాగే మస్టర్డ్ ఆయిల్ పాదాల నొప్పిని తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది. రాత్రిపూట ఆవాల నూనెను వేడి చేసి పాదాలకు బాగా మసాజ్ చేయండి. ఇది మీకు నొప్పి నుండి ఖచ్చితంగా మంచి ఉపశమనం ఇస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: