షుగర్ వ్యాధిగ్రస్తులు ఖచ్చితంగా తినాల్సిన పండ్లు?

Purushottham Vinay
 షుగర్ వ్యాధి గ్రస్తులు ఖచ్చితంగా పండ్లను ఆహారంగా తీసుకోవాలి.అంతేగాక వారు పండ్లను ఆహారంగా తీసుకోవడం వల్ల రక్తనాళాల్లో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ కరగడంతో పాటు శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. చాలా మందికి కూడా పండ్లను తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయన్న అపోహ ఉంది.  మామిడి పండ్లను, పనస తొనలను, సపోటా, సీతాఫలం, అరటి పండ్లను ఇంకా అలాగే ఖర్జూర పండ్లను షుగర్ వ్యాధి గ్రస్తులు ఎక్కువగా తీసుకోకూడదు. వీటిని తీసుకున్న వెంటనే రక్తంలో చక్కెర స్థాయిల ఈజీగా పెరుగుతాయి.వీటిలో పిండి పదార్థాలు, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీటిని తీసుకున్న వెంటనే రక్తంలో చక్కెర స్థాయిలు ఈజీగా పెరుగుతాయి.అయితే షుగర్ వ్యాధి గ్రస్తులు పుచ్చకాయ, కర్బూజ, బొప్పాయి, కమలా పండ్లు, జామ పండ్లు, పైనాపిల్‌, ఆపిల్ ఇంకా అలాగే దానిమ్మ వంటి పండ్లను  ఎటువంటి సందేహం లేకుండా తీసుకోవచ్చు. ఎందుకంటే వీటిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. అందుకే ఈ పండ్లను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వెంటనే పెరగకుండా ఉంటాయి.


షుగర్ వ్యాధి గ్రస్తులు పూర్తిగా పండ్లను తినడం మానేయడం వల్ల వారిలో ఖచ్చితంగా పలు అనారోగ్య సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. అందుకే క్యాలరీలు, పిండి పదార్థాలు తక్కువగా ఉండే ఈ పండ్లను తీసుకోవడం వల్ల వారి ఆరోగ్యానికి మేలు కలగడంతో పాటు రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉంటాయని కూడా ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.కాబట్టి పండ్లను తప్పకుండా ఆహారంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. పండ్లను ఆహారంగా తీసుకోకపోతే వారు చాలా నష్టపోతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. షుగర్ వ్యాధి గ్రస్తుల్లో రక్త ప్రసరణ వ్యవస్థ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అలాగే రోగ నిరోధక వ్యవస్థ కూడా చాలా తక్కువగా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటే రోగ నిరోధక వ్యవస్థ కూడా చాలా తక్కువగా ఉంటుంది. దీంతో అవయవాలు దెబ్బతినడం ఇంకా త్వరగా ఇన్ఫెక్షన్ ల బారిన పడడం వంటివి జరుగుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: