కడుపులోని మురికి, విషపదార్ధాలను బయటకి పంపే టిప్?

Purushottham Vinay
జీర్ణవ్యవస్థ వల్ల శరీరానికి మంచి పోషకాలు అందుతాయి. పెద్దప్రేగు అనేది జీర్ణవ్యవస్థలో చాలా ముఖ్యమైన భాగం. . పెద్దపేగులోని మురికి ఎన్నో రకాల వ్యాధులకు కారణమవుతుంది. దాన్ని శుభ్రంగా ఉంచుకోవడానికి మీరు సులభమైన పద్ధతిని పాటించండి. అందుకు మీరు కొన్ని జ్యూస్‌లు ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోని తాగవచ్చు. ఈ జ్యూస్ లు జీర్ణాశయానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అవి మీ పేగులను బాగా శుభ్రపరిచి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.ఇక యాపిల్ జ్యూస్ పేగులను చాలా ఆరోగ్యంగా ఉంచుతుంది. యాపిల్ తినడం ఆరోగ్యానికి ఎంత మేలో దాని రసం కూడా అంతే మేలు చేస్తుంది. యాపిల్ జ్యూస్ తాగడం వల్ల పొట్ట చాలా శుభ్రంగా ఉంటుంది. దీన్ని తాగడం వల్ల కడుపులోని మురికి ఇంకా విషపదార్థాలు మలం ద్వారా శరీరం నుంచి బయటకు వెళ్లిపోతాయి.ఇంకా అలాగే కూరగాయల రసం కూడా ప్రేగులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.


బచ్చలికూర, టొమాటో, క్యారెట్, క్యాలీఫ్లవర్, బ్రోకలీ, పొట్లకాయ ఇంకా చేదు రసాన్ని తప్పనిసరిగా తాగాలి. ఈ కూరగాయల రసం ద్వారా శరీరం నుండి టాక్సిన్స్ ఈజీగా తొలగించబడతాయి. పెద్దప్రేగు ఎల్లప్పుడూ కూడా చాలా శుభ్రంగా ఉంటుంది. ఉదయం పూట ఖాళీ కడుపుతో దీన్ని తాగండి. ఖచ్చితంగా మీరు అపారమైన ఉపశమనం పొందుతారు.ఆరోగ్య నిపుణులు పేగును శుభ్రపరచడానికి ఉప్పు నీటిని కూడా సూచించారు.  ఇక ఉప్పు కలిపిన నీటిని తాగడం ప్రేగులను శుభ్రపరచడానికి సహాయపడుతుందని ఓ పరిశోధనలో చెప్పబడింది. రెండు టీస్పూన్ల ఉప్పు, ఒక గ్లాసు గోరువెచ్చని నీటి ద్రావణం మీ ప్రేగులను శుభ్రపరచడానికి ఎంతగానో ప్రభావవంతంగా ఉంటుంది.అలాగే నిమ్మరసంలో విటమిన్ సి అధిక మోతాదులో ఉంటుంది. ఇది ఎసిడిటీని దూరం చేయడం ద్వారా జీర్ణవ్యవస్థను బాగా బలపరుస్తుంది. ఈ రసం కడుపులోని హానికరమైన బ్యాక్టీరియాను చంపి ఇంకా అలాగే పేగును బాగా శుభ్రపరుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: