నోటి సమస్యలకు చెక్ పెట్టే టిప్స్?

Purushottham Vinay

చాలా మంది పళ్ళ సమస్యలతో తెగ ఇబ్బంది పడుతుంటారు.గోరువెచ్చని ఉప్పు నీటిని తీసుకొని ఆ నీటితో మీ నోటిని పుక్కిలించడం వల్ల దంతాల వాపు చాలా సులభంగా తగ్గుతుంది. ఇంకా అలాగే నొప్పి నుంచి కూడా మీరు ఉపశమనం పొందవచ్చు. అందుకు మీరు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక టీస్పూన్ ఉప్పు కలపండి. ఆ తర్వాత దానిని మీ నోటిలో ఉంచండి. తర్వాత ఆ ఉప్పు నీటిని ఉమ్మివేసేయండి. ఇలా రోజుకు రెండు సార్లు రిపీట్ చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది.ఇంకా అలాగే లవంగం నూనెలో మత్తుమందు, క్రిమినాశక లక్షణాలను కలిగి ఉంది. ఇది పంటి నొప్పికి చాలా మంచి ఇంటి నివారణ. కొన్ని చుక్కల లవంగం నూనెను తీసుకొని దానిని దూదిపై రాసి నొప్పిగా ఉన్న పంటిపై 20 నుంచి 30 నిమిషాల పాటు ఉంచితే పంటి నొప్పి ఈజీగా తగ్గుతుంది.ఇంకా అలాగే వెల్లుల్లిలో సహజసిద్ధమైన యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉన్నాయి. ఇది పంటి నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు చాలా బాగా సహాయపడుతుంది.


వెల్లుల్లి రెబ్బను తీసుకొని దానిని చూర్ణం చేసి, అందులో కొంచెం ఉప్పు కలిపి నొప్పిగా ఉన్న పంటిపై రాస్తే ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది.ఇక పిప్పరమెంటు శీతలీకరణ అనుభూతి పంటి నొప్పి ఇంకా అలాగే వాపును ఈజీగా తగ్గిస్తుంది. అందుకోసం పిప్పరమింట్ బ్యాగ్‌ను తీసుకొని నొప్పి ఉన్న పంటిపై ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు ఉంచితే మంచి ఫలితం ఉంటుంది.పళ్ళ సమస్యలకు హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది చాలా మంచిది. ఎందుకంటే ఇది క్రిమినాశక లక్షణాలను కలిగి ఉంది. ఇది మీ నోటిలోని బ్యాక్టీరియాను చంపడానికి ఇంకా అలాగే వాపును తగ్గించడానికి ఎంతగానో ఉపకరిస్తుంది. హైడ్రోజన్ పెరాక్సైడ్ ఇంకా నీటిని తీసుకొని వాటిని సమాన భాగాలుగా కలపి.. వాటితో మీ నోటిని ఒక 30 సెకన్ల పాటు శుభ్రం చేసుకోండి.ఈ పద్ధతులు పాటిస్తే ఎలాంటి నోటి సమస్యలు వున్న ఈజీగా తగ్గిపోతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: