నోటి శుభ్రం లేకుంటే మెదడుకే ప్రమాదం?

Purushottham Vinay
మన నోటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం మెరుగైన మెదడు ఆరోగ్యానికి అవసరమని అమెరికన్ స్ట్రోక్ అసోసియేషన్ నిర్వహించే ఇంటర్నేషనల్ స్ట్రోక్ కాన్ఫరెన్స్ 2023లో సమర్పించనున్న అధ్యయనం ఈ విషయాన్ని తెలిపింది. చిగుళ్ల వ్యాధి, నోటి పరిశుభ్రత సరిగ్గా లేకపోవడానికి స్ట్రోక్ ముప్పు పెరిగేందుకు మధ్య సంబంధాన్ని ఈ అధ్యయనం సూచించింది. ఎంఆర్ఐ స్కాన్ ద్వారా ఈ రెండింటి మధ్య వున్న సంబంధాన్ని ఇప్పుడు మనం పసిగట్టవచ్చని అధ్యయన రచయిత ఇంకా యేల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన సిప్రిన్ రివిర్ తెలిపడం జరిగింది.మన నోటిలో చిగుళ్ల మీద ఒక గారలాంటిది ఏర్పడుతుంటుంది. దీన్నే సూప్రా జింజివల్‌ ప్లాక్‌ లేదా సబ్‌ జింజివల్‌ ప్లాక్‌ అని అంటారు. ఇది మన రక్తంలోని ప్లేట్‌లెట్‌లను కూడా గుంపులుగా చేరేలా చేస్తుంది. దాంతో రక్తం గడ్డకట్టే ప్రక్రియల్లో ఒకటైన 'థ్రాంబస్‌ ఫార్మేషన్‌' అనేది జరుగుతుందట.


దాని ఫలితంగా రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే ప్రమాదం ఎక్కువగా ఉంది. దీన్నే 'థ్రాంబో ఎంబాలిజమ్‌' అని అంటారు. ఈ ప్రక్రియ మెదడుకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాల్లో జరిగినప్పుడు అది బ్రెయిన్‌స్ట్రోక్‌కు ఖచ్చితంగా దారి తీయవచ్చు. ఇక అంతేకాదు మన నోటిలోని, ముఖ్యంగా కోరపళ్ల దగ్గర ఇన్ఫెక్షన్‌ వచ్చి ఇక అక్కడి నుంచి మెదడుకు పాకి కేవర్నస్‌ సైనస్‌ థ్రాంబోసిస్‌ అనే కండీషన్‌కు దారితీసే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఇది చాలా ప్రాణాంతకం. అందుకే నోటిని ఖచ్చితంగా చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. అంటే మనం పళ్ళని శుభ్రంగా కడుక్కోవడమంటే మెదడుని కూడా సురక్షితంగా ఉంచుకోవడమే..అందుకే ఖచ్చితంగా నోటి శుభ్రతను పాటించండి. మీ మెదడు ఆరోగ్యాన్ని బాగా మెరుగుపరచుకొని ఎల్లప్పుడూ కూడా ఎలాంటి రోగాలు రాకుండా సంపూర్ణ ఆరోగ్యంగా జీవించండి.రోజుకి రెండు సార్లు నోటిని శుభ్రం చేసుకోండి. తిన్న వెంటనే నోటిని నీటితో పుక్కిలించండి. అలాగే రోజు ఎక్కువ సార్లు నీటిని తాగుతూ వుండండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: