మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తూ ఉంటే ఐరన్ లోపం ఉన్నట్టే..!

Divya
సాధారణంగా ఈ మధ్యకాలంలో పోషకాహార లోపం వల్ల, చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరిలోనూ, రక్తహీనత సమస్య తలెత్తుతూ ఉంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలలో రక్తహీనత అధికంగా ఉంటుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. కానీ మన శరీరం రక్తం తగ్గుతుందని కొన్ని లక్షణాలను ముందుగానే చూపిస్తూ ఉంటుంది. అలాంటి లక్షణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
 ముందుగానే కనిపించే  రక్తహీనత లక్షణాలు..
చిన్న పని చేసిన అలసటగా అనిపించడం, మన గుండె చప్పుడు మనకే వినిపించేంత ఆత్రుత ఉండడం, చర్మం పాలిపోయినట్టు అవ్వడం, ఎక్కువ దూరం నడవలేకపోవడం, తరచూ తలనొప్పి, వికారం కలగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కారణంగా ఉండాల్సిన హెయిర్ ఫాల్ కన్నా, అధికంగా హేయిర్ ఫాల్ అవ్వడం,గోర్లు తరుచూ విరుగుతూ ఉంటాయి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే మీ శరీరంలో ఐరన్ లోపం వున్నట్టే. కావున ఇలాంటి లక్షణాలు కనిపిస్తూనే వైద్యున్ని సంప్రదించడం ఉత్తమం.ఐరన్ లోపం వల్ల మన శరీరంలో  అనేక ఆరోగ్య సమస్యలు చుట్టూముడుతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

 మన శరీరంలో రక్తహీనత వల్ల, గుండెకు జరగాల్సిన రక్త సరఫరా సక్రమంగా జరగక, గుండె పనితీరు దెబ్బతింటుంది. మనం తిన్న ఆహారం నుంచి కాల్షియం శోషించుకోవడానికి రక్తం చాలా బాగా ఉపయోగపడుతుంది.రక్త హీనత ఏర్పడినప్పుడు కాల్షియం సరిగా శోషించుకోకపోవడం వల్ల,కాల్షియం డెఫిషియన్సీ ఏర్పడి ఎముకలు గుల్లబారుతాయి. అంతేకాక మనం తిన్న ఆహారంలోని పోషకాలన్ని రక్తంలోకి కలిసిపోయి వివిధ భాగాలకు చేరవేయబడతాయి.అందువల్ల రక్తహీనత ఏర్పడినప్పుడు సరైనా క్రమంలో పోషకాలు వివిధ భాగాలకు చేరలేవు.దీనితో ఇతర శరీర భాగాలు దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
 రక్త హీనత తగ్గించడానికి ఉపయోగపడే ఆహారాలు..
 శరీరంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడానికి విటమిన్ ఏ మరియు విటమిన్ సి గల ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. అందులోను ముఖ్యంగా ఆకుకూరలు, నిమ్మ జాతి పండ్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల మన శరీరంలోని రక్తహీనతనం తగ్గించుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: