జలుబు, దగ్గు చిటికెలో తగ్గాలంటే...?

Purushottham Vinay
జలుబు,దగ్గు వంటి సమస్యలు తలెత్తగానే చాలా మంది కూడా యాంటీ బయాటిక్ లను, దగ్గు మందులను ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇలా ఈ మందులు కాకుండా మన ఇంట్లో ఉండే పదార్థాలతో మనం చాలా ఈజీగా ఈ సమస్యలను తగ్గించుకోవచ్చు. ప్రతి ఒక్కరి ఇంట్లో వాము, అల్లం ఇంకా అలాగే మిరియాలు వంటి ఈ మూడు పదార్థాలు  ఉంటాయి. ఇవి జలుబు, దగ్గు వంటి సమస్యలను చాలా ఈజీగా తగ్గించడంలో బాగా సహాయపడతాయి.ఇక అల్లంలో యాంటీ వైరల్ ఇంకా యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు చాలా పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇన్ ప్లామేషన్ ను తగ్గించడంలో చాలా చక్కగా పని చేస్తాయి.ఇంకా అదే విధంగా మిరియాలు కూడా జలుబు, దగ్గు వంటి సమస్యలను తగ్గించడంలో బాగా సహాయపడతాయి. పెప్పరిన్ అనే రసాయన సమ్మేళనం మిరియాల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది జలుబు ఇంకా దగ్గు వంటి సమస్యలు తలెత్తినప్పుడు గాలి గొట్టాలు ముడుచుకుపోకుండా చేయడంలో ఇంకా అలాగే గాలి సక్రమంగా ఆడేలా చేయడంలో ఎంతగానో సహాయపడుతుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి.అలాగే కఫాన్ని తొలగించడంలో కూడా ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇక వాములో కూడా చాలా ఔషధ గుణాలు ఉంటాయి. వాములో థైమాల్ అనే రసాయన సమ్మేళనం  ఉంటుంది.


గాలితిత్తులను ఇంకా అలాగే గాలి గొట్టాల్లో ఉండే ఇన్ ప్లామేషన్ ను తగ్గించి వాటిని సాధారణ స్థితికి తీసుకురావడంలో వాము ఎంతగానో సహాయపడుతుంది. దగ్గు, జలుబు, గొంతునొప్పి ఇంకా అలాగే గొంతులో ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు ఇబ్బంది పెడుతున్నప్పుడు ఒక గ్లాస్ నీళ్లల్లో ఒక ఇంచు అల్లం ముక్క, అర టీ స్పూన్ వాము, అర టీ స్పూన్ మిరియాల పొడి వేసి సగం గ్లాస్ కషాయం అయ్యే దాకా మరిగించాలి.ఆ తరువాత దీనిని వడకట్టి ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. ఈ కషాయం గోరు వెచ్చగయిన తరువాత టీ లాగా కొద్ది కొద్దిగా తాగాలి.రోజుకు ఇలా రెండు సార్లు ఇలా తాగడం వల్ల జలుబు ఇంకా దగ్గు వంటి సమస్యల నుండి ఖచ్చితంగా ఉపశమనం కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ కషాయాన్ని చిన్న పిల్లల దగ్గర నుండి పెద్ద వారి దాకా ఎవరైనా కూడా తాగవచ్చు. దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలు బాగా ఇబ్బంది పెడుతున్నప్పుడు మందులు వాడడానికి బదులుగా ఇలా సహజసిద్దమైన కషాయాన్ని తయారు చేసుకుని తాగితే మంచి ఫలితం ఉండడంతో పాటు దుష్ప్రభావాల బారిన కూడా పడకుండా ఉంటామని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: