చర్మ రక్షణకు మేలు చేసే ఆహారాలు?

Purushottham Vinay
చర్మ రక్షణకు విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ బి-8, పాంతోతేనిక్ యాసిడ్, ఫోలేట్, పొటాషియం, ఐరన్, కాపర్, మాంగనీస్ వంటి పలు పోషకాలు అవసరం. అయితే ఇవన్నీ కూడా మనకు క్యారెట్‌ ద్వారా లభిస్తాయి. క్యారెట్‌లో చాలా ఫైబర్ ఇంకా బీటా కెరోటిన్ లభిస్తాయి. ఇవి సూర్యుని నుంచి వచ్చే హానికరమైన అతినీలలోహిత కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తాయి. దెబ్బతిన్న చర్మాన్ని సరిచేయడంలో కూడా క్యారెట్లోని పోషకాలు చాలా బాగా సహాయపడుతాయి.ఇంకా అలాగే మన శరీరానికి కావాల్సిన ప్రోబయోటిక్స్‌ అధిక పరిమాణంలో లభించాలంటే ఆహారంలో  పెరుగు అనేది తప్పనిసరిగా ఉండాల్సిందే.మనం పెరుగును ఫేస్‌ ప్యాక్‌ లాగా కూడా వాడచ్చు. ప్రతి రోజూ పెరుగును ఆహారంలో తీసుకుంటే చర్మంపై ముడతలు చాలా ఈజీగా తొలగిపోవడంతో పాటు దానిపై రంధ్రాలు ఇంకా మచ్చలు లేకుండా ముఖచర్మం చాలా మృదువుగా తయారవుతుంది.ఇంకా అలాగే పిల్లలకు చిన్నప్పటి నుంచి పెరుగు తినడం అలవాటు చేయడం చాలా మంచిది.ఇంకా అలాగే ప్రతిరోజూ కూడా దానిమ్మను తీసుకోవడం వల్ల వృద్ధాప్యాన్ని చాలా ఈజీగా నియంత్రించవచ్చు. మీ చర్మం ఎక్కువ కాలం యవ్వనంగా ఉండాలంటే ప్రతి రోజూ కూడా ఆహారంలో దానిమ్మను వినియోగించాలి.


దానిమ్మ రసాన్ని తాగడం వల్ల చాలా రకాల ఆరోగ్య సమస్యలు ఈజీగా దూరమవుతాయి.షుగర్‌ వ్యాధి ఉన్న వారు కూడా దానిమ్మను తీసుకోవచ్చు.ఇంకా అలాగే పాలలో ఉండే పోషకాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. మనం బాదం పప్పును ఏ విధంగా తీసుకున్నా కూడా అందులో చర్మాన్ని యవ్వనంగా ఉంచే లక్షణాలున్నాయి . అందువల్ల ప్రతి రోజూ కూడా గుప్పెడు బాదం పప్పు తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది.అలాగే పాలలో బాదం పప్పులను నానబెట్టి తీసుకున్న కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి.అలాగే ఆకు కూరల్లో క్లోరోఫిల్‌ చాలా ఎక్కువ పరిమాణంలో లభిస్తుంది. ఆకుకూరలను తీసుకోవడం వల్ల శరీరానికి ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. చర్మం ఆరోగ్యంగా ఇంకా యవ్వనంగా ఉండాలంటే ఆకుకూరలను ఆహారంలో తీసుకోవడం తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలి. ఆకుకూరల తినడం వల్ల ఏ లోపం లేకుండా శరీరానికి సమృద్ధిగా విటమిన్లు అందుతాయి. అంతేగాక అనారోగ్య సమస్యల నుంచి కూడా మీకు ఉపశమనం కలుగుతుంది.  వృద్ధాప్య సమస్యలతో బాధపడేవారికి ఆకు కూరల నుంచి మంచి ఫలితాలు లభిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: