బాడీకి ఐరన్ కంటెంట్ ఇచ్చే జ్యూసులు ఇవే?

Purushottham Vinay
మన బాడీకి ఐరన్ కంటెంట్ అనేది చాలా ముఖ్యమైన అంశం. ఐరన్ లోపం అనేది చాలా తీవ్రమైన వ్యాధులకు కారణమవుతుంది. మన శరీరంలోని అవయవాలకు ఆక్సిజన్ అందించడానికి ఐరన్‌ బాగా పనిచేస్తుంది.బాడీలో ఐరన్‌ లోపిస్తే చిన్న పని చేసినా కూడా వెంటనే అలసిపోతుంటారు. ఇంకా అలాగే శ్వాస తీసుకోవడంలో కూడా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలాంటి స్థితిలో ఐరన్‌ లోపాన్ని అధిగమించడానికి ఈ జ్యూస్‌లు అనేవి చాలా బాగా పనిచేస్తాయి. వీటిని క్రమం తప్పకుండా తాగడం ద్వారా ఐరన్ లోపాన్ని చాలా సులభంగా అధిగమించవచ్చు.ఇక గుమ్మడికాయ గింజలు ఐరన్‌కు చాలా గొప్ప మూలం. ఇవి యాంటీఆక్సిడెంట్లు ఇంకా అవసరమైన ఖనిజాలను కూడా అందిస్తాయి. గుమ్మడికాయ గింజలతో జ్యూస్ లేదా స్మూతీని తయారు చేసుకోని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే దీన్ని మీరు ఆహారంలో చేర్చుకుని కూడా తినొచ్చు.ఇంకా అలాగే బీట్‌రూట్ జ్యూస్ కూడా మరొక సాధారణ ఐరన్-రిచ్ డ్రింక్. బీట్‌రూట్‌లో ఐరన్‌ చాలా ఎక్కువగా ఉండటమే కాకుండా, పొటాషియం, మాంగనీస్, ఫోలేట్, బీటైన్ ఇంకా అలాగే విటమిన్ సీ వంటి ఇతర ముఖ్యమైన పోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయి.


దీనిలో ఉండే ఖనిజాలు రక్త కణాలను సరిచేయడానికి ఇంకా అలాగే ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరచడంలో చాలా బాగా సాయపడతాయి. అలాగే క్యారెట్ ఇంకా నారింజ లేదా ఉసిరిని కలుపుకోవడం ద్వారా బీట్‌రూట్ రసాన్ని మరింత రుచికరంగా కూడా చేసుకోవచ్చు.ఇంకా అలాగే బచ్చలి కూరలో కూడా ఐరన్ చాలా పుష్కలంగా ఉంటుంది. ఇది మన శరీరానికి ఐరన్ సరఫరా చేయడంలో చాలా బాగా సహాయపడుతుంది. బచ్చలికూర రసానికి కొబ్బరి, నీళ్లు, జీడిపప్పు ఇంకా అలాగే పైనాపిల్ కలిపి తీసుకుంటే దాని రుచి ఇంకా పెరుగుతుంది. ఈ జ్యూస్ ను ప్రతి రోజూ కూడా తాగడం వల్ల శరీరానికి కావాల్సిన ఐరన్ అనేది అందుతుంది.ఇంకా అలాగే పీ ప్రోటీన్ షేక్ శరీరంలో ఐరన్ స్థాయిలను పెంచడంలో చాలా బాగా సాయపడుతుంది. ఈ జ్యూస్‌ను చాలా ఈజీగా మీ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇక వేరే ప్రోటీన్ పౌడర్లతో పోలిస్తే బఠానీ ప్రోటీన్‌లో ఎక్కువ మొత్తంలో ఐరన్ అనేది ఉంటుంది. బఠానీ ప్రోటీన్ పౌడర్‌తో పానీయాన్ని  షేక్ లేదా స్మూతీగా చేసుకోని తాగితే చాలా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: