విటమిన్ బి-12 లోపంతో బాధపడుతున్నారా.. అయితే ఇవి వాడాల్సిందే..!!

Divya
సాధారణంగా మామిడి కాయలంటే చిన్నా పెద్ద తేడా లేకుండా ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ఎండాకాలం వచ్చిందంటే మామిడి పళ్ళు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తూంటారు. అలాంటి మామిడి పండ్లను తిని అందులోని టెంకను వేస్ట్ గా పడేస్తూంటాము. కానీ టెంకలోని జీడి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నాయని ఆయుర్వేదనిపుణులు తెలియజేస్తున్నారు. ఆ ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
 ఇందులోని పోషకాలు..
100 గ్రాముల జీడిని తీసుకుంటే 420 క్యాలరీల శక్తి వస్తుంది.ఇందులో కార్బోహైడ్రేట్స్ 70 గ్రాములు,ప్రోటీన్స్ 12 గ్రామ్స్,  మంచి కొవ్వులు 15 గ్రాములు, పైబర్ 2గ్రాములు, క్యాల్షియం 11 మిలిగ్రాములు,ఐరన్ 20 మిల్లీ గ్రాములు, విటమిన్ బీ12 110 మైక్రో గ్రాములు లభిస్తాయి.
 సాధారణంగా ప్రేగులలోని మంచి బ్యాక్టీరియా విటమిన్ బి 12 ని సహజసిద్ధంగా తయారు చేస్తుంది.కానీ మనం తినే ఆహారంలో అసిడిక్ విలువలు ఎక్కువగా ఉండటం వల్ల, ఆ మంచి బ్యాక్టీరియా చనిపోతూ ఉంది. కావున మనము మన ఆహారం నుంచె b12 ని పొందాల్సి వస్తుంది.అన్ని మాంసాహారాల ద్వారా విటమిన్ బి12 పుష్కలంగా అందుతుంది. కానీ శాకాహారులకు  వారు తినే పండ్లు, కూరగాయల్లో లభించకపోవడం వల్ల, వీరికే ఎక్కువగా విటమిన్ బి12 లోపం  వస్తూంటుంది. అలాంటి వారికీ కావాల్సినంత విటమిన్ 12 పుట్టగొడుగులలోనూ, మామిడిజీడి లోను లభిస్తుంది.సాధారణంగా మానవునికి కావాల్సిన b12 2.4మైక్రో గ్రామ్స్ మాత్రమే కానీ, మామిడిజీడిలో 110 మైక్రో గ్రామ్స్ లభిస్తుంది. కావున దీనిని విటమిన్ b12 కీ పుట్టినిల్లు అని చెప్పవచ్చు.
తీసుకొనే విధానం..
మామిడిజీడిని పచ్చిగా వున్నప్పుడే తింటే నోరు పొక్కడం,వీరేచనాలు , ఆసిడిటి వంటి సమస్యలు వస్తాయి. కావున మామిడిజీడిని బాగా ఎండబెట్టి,పౌడర్ లా చేసుకొని, దానిని రోజూ గోరువెచ్చని నీటిలో,అరస్ఫూన్ చొప్పున కలుపుకొని త్రాగాలి. లేదా రోటీల పైన కానీ, సలాడ్ ల పైన కానీ చల్లుకొని తినాలి. ఇలా తరుచు చేస్తే విటమిన్ b12 లోపం నివారించుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: