సపోటా.. మన ఆరోగ్యానికి ఏ విధంగా సహాయ పడుతుందో తెలుసా..?

Divya
సపోటా...... తీయని రుచితో పాటు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో ఉండే గుజ్జు తేలికగా జీర్ణం అయ్యి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. చర్మానికి ఆరోగ్యాన్ని ఇవ్వడంతో పాటు పలు అనేక ప్రయోజనాలు సపోటా వలన కలుగుతాయి. ఇందులో అనేక పోషకాలతో పాటు పొటాషియం,కాపర్, ఐరన్, మరియు విటమిన్స్ తో పాటు జీర్ణశక్తిని పెంచే ఎంజైమ్స్ లను కూడా కలిగి ఉంది. సపోటా విటమిన్స్ ను సమృద్ధిగా కలిగి ఉంది.ఇది మన చర్మానికి ఎంతగానో దోహదపడుతుంది.మన చర్మానికి మాశ్చరైజర్ లా పనిచేస్తుంది.
ఇందులో ఉండే యాంటీ  ఆక్సిడెంట్స్ మన చర్మాన్ని ముడతలు మరియు పొడిబారే సమస్యల నుండి తగ్గిస్తుంది.మన చర్మాన్ని కాంతివంతంగా మార్చుతుంది. సపోటా నుండి వచ్చే పాలకు చర్మంపై ఉన్న పులిపిర్లను తగ్గించే శక్తిని కలిగి ఉంది.సపోటా మన జుట్టు  ఆరోగ్యంగా పెరిగేలా సహాయం చేస్తుంది. సపోటా గింజల నుండి తీసిన ఆయిల్ జుట్టుకు మంచి కండీషనర్ల ఉపయోగపడుతుంది.  జుట్టును మృదువుగా మార్చడమే కాకుండా నిర్జీవంగా మారిన కేశాలను పునరుద్ధరిస్తుంది. జుట్టు చిట్లడం మరియు రాలిపోయే సమస్యలను తగ్గిస్తుంది. వెంట్రుకల కుదుళ్ల నుండి బలోపేతం చేసి ఆరోగ్యవంతమైన జుట్టును పెరిగేలా చేస్తుంది.
సపోటా యాంటీ వైరల్ మరియు యాంటీ  బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంది.ఇది శరీరాన్ని వైరల్ మరియు ఫ్రీరాడికల్స్ భారీ నుండి రక్షిస్తుంది. ఇందులో ఉండే పీచు పదార్థం శరీరంలో ఉండే వ్యర్ధాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది. జీర్ణశక్తిని పెంచి మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. మూత్ర విసర్జన సాఫీగా జరిగేలా చేస్తుంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఫైల్స్ సమస్యతో బాధపడుతున్న వారు కూడా ఈ సపోటా పనులను తినడం వల్ల త్వరగా ఉపశమనం పొందవచ్చు అయితే సపోటాలు తినేటప్పుడు పాలు నోట్లో పడకుండా జాగ్రత్త పడాలి లేకపోతే నోరు కందిపోయే అవకాశం కూడా ఉంటుంది బాగా పండిన తర్వాతనే సపోటా తినడం వల్ల ఈ ప్రయోజనాలన్నీ పొందుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: