నల్ల నువ్వులు,బెల్లం కలిపి తింటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..!

Divya
నల్లనువ్వులను పోషకాల గని అని చెప్పవచ్చు. నల్ల నువ్వులతో చేసిన ఆహార పదార్థాలు శరీరానికి చాలా పోషకాలను అందిస్తాయి.నువ్వులు మరియు బెల్లంలో ఐరన్ శాతం అధికంగా ఉంటుంది. వీటిని తరచూ తీసుకోవడం వల్ల, హిమోగ్లోబిన్ శాతం పెరిగి,రక్తహీనత తగ్గుతుంది.
తరుచు నువ్వులను వాడటం వల్ల, రక్తంలోని చక్కర స్థాయిలను నియంత్రిస్తుంది. దాంతో క్లోమం పనితీరు సక్రమంగా ఉంటుంది. నల్ల నువ్వుల్లో యాంటీ కాన్విల్సివ్ లక్షణాలు అధికంగా ఉండటం వల్ల , ఇవి చాలా రకాల అనారోగ్యాలు దరి చేరకుండా నియంత్రిస్తాయి.అవేంటో ఇప్పుడు చూద్దాం..
నల్ల నువ్వులను బెల్లం తో కలిపి తీసుకోవడం వల్ల ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమెటరీ గుణాలు  బ్రెస్ట్ క్యాన్సర్ మరియు బ్రెయిన్ క్యాన్సర్ రాకుండా కాపాడుతాయి.నల్ల నువ్వుల్లో ఉండే ఆప్టోప్టోసిన్ సెల్స్ లుకేమియాకు గురికాకుండా రక్షిస్తుంది.
నువ్వుల ఉండలను రోజుకొకటి తీసుకోవడం ద్వారా వ్యాధినిరోధకత శక్తిని పెంచుకోవచ్చు. నల్ల నువ్వులు టైప్ 2 మధుమేహ వ్యాధి గ్రస్తులకు ఉపయోగపడుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అధిక మూత్ర వ్యాధితో ఇబ్బందిపడేవారు కేవలం నువ్వులను మాత్రమే పొడిచేసి, గోరువెచ్చటి నీటిలో కలిపి సేవిస్తూ వుంటే తొందరగా ఉపశమనం కలుగుతుంది.అంతే కాక ఇలా చేయడం వల్ల, శ్వాస సంబంధిత సమస్యలు నివారించబడుతాయి.
క్యాల్షియం కొరతతో ఇబ్బంది పడేవారు,రోజుకొక బెల్లంతో కలిపి నువ్వులు ఉండ తింటే మంచి ఫలితం ఉంటుంది. దీని ద్వారా శరీరానికి కావాల్సిన మొత్తం  క్యాల్షియం ఇందులోనే లభిస్తుంది.తద్వారా కీళ్ళనొప్పులు, నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు దరిచేరవు.
వీటిని రోజు తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు పదార్థాలను బయటకి పంపి మన శరీరాన్ని శుభ్ర పరుస్తుంది.ఈ నువ్వుల్లో ఉండే పోషకాలు,వయసు వల్ల కలిగే వృద్యాప్య ఛాయాలను దూరం చేస్తాయి.
సాధారణంగా స్త్రీలలో ఋతుస్త్రావం కాకపోవడం, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, కడుపునొప్పి, వికారం వంటి  ఋతు సమస్యలను తగ్గించడంలో బెల్లం కలిపిన, నువ్వుల ఉండలు చాలా బాగా సహాయపడతాయి. మరియు మగవారిలో శుక్రకణ ఉత్పత్తికి దోహదం చేస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: