క్యాబేజీని తినడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు?

Purushottham Vinay
క్యాబేజీని తినడం వల్ల మనం చాలా రకాల ఆరోగ్యప్రయోజనాలను పొందవచ్చు.ఎందుకంటే వీటిలో ఉండే బీటా కెరోటిన్ కంటి లోపల మచ్చలను తగ్గించటంలో చాలా బాగా సహాయపడుతుంది.
ఈ క్యాబేజీలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండడం వలన ఫ్రీ రాడికల్స్ నుంచి చర్మాన్ని రక్షించి వృద్దాప్య ఛాయలను ఈజీగా తగ్గిస్తుంది.ఇంకా పిల్లలకు పాలిచ్చే తల్లులు రోజు క్యాబేజీని తింటే వారికి పాలు బాగా పడతాయి. అలాగే క్యాబేజీలో  ఉండే ల్యాక్టిక్ ఆమ్లం గొంతు నొప్పి నుంచి ఉపశమనం అందించడంలో సహాయపడుతుంది. ఇంకా ఈ క్యాజేజీ దగ్గుకు కూడా మంచి మందుగా పనిచేస్తుంది. క్యాబేజీ ఆకులను నమిలినా లేదా క్యాబేజీ ఆకుల రసం తాగినా దగ్గు చాలా త్వరగా తగ్గిపోతుంది.అయితే ఈ క్యాబేజి రసం త్రాగలేని వారు కొంచెం పంచదార వేసుకోని తాగవచ్చు. అయితే పంచదార వేసుకోకుండా త్రాగితేనే ఆరోగ్యానికి మంచిది.  ఇంకా అంతేకాకుండా కంటి శుక్లాలు రాకుండా కూడా కాపాడుతుంది. ఈ క్యాబేజిలో ఎమినో యాసిడ్స్ సమృద్ధిగా ఉండడం వలన కడుపు మంటను తగ్గించటంలో కూడా చాలా బాగా సహాయపడుతుంది. 


అలాగే ఈ క్యాబేజిలో విటమిన్ సి సమృద్ధిగా ఉండడం వలన శరీరంలో వ్యాధినిరోధక శక్తిని కూడా పెంచుతుంది. అలాగే రోగనిరోధక శక్తిని వ్యవస్థను బలోపేతం చేయటంలో సహాయం చేసే ఫ్రీరాడికల్స్‌ను నుంచి శరీరాన్ని బాగా రక్షిస్తుంది.అలాగే క్యాబేజీలో అల్జీమర్స్‌ని నిరోధించే లక్షణాలు ఉన్నట్టు కనుగొన్నారు . ఈ లక్షణాలు ఓన్లీ రెడ్ క్యాబేజీలో మాత్రమే ఉన్నాయి.అల్జీమర్స్ సమస్యను నివారించే విటమిన్ K రెడ్ క్యాబేజీలో పుష్కలంగా ఉంటుంది.అలాగే క్యాబేజీ రసం గ్లూటమిన్ అనే కంటెంట్‌లో యాంటీ అల్సర్ గుణాలు కలిగి ఉన్నాయి. అందువల్ల కడుపులో మంట ఇంకా అలాగే కడుపులో పూతలు తగ్గుతాయి. కాబట్టి కడుపు మంట ఉన్నప్పుడు క్యాబేజీ రసం కనుక త్రాగితే ఖచ్చితంగా మీకు ప్రయోజనం ఉంటుంది.క్యాబేజీని క్రమం తప్పకుండా ఆహారంలో భాగంగా చేసుకుంటే అధిక బరువు సమస్యకు కూడా చాలా ఈజీగా చెక్ పెట్టవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: