షుగర్ వ్యాధిగ్రస్తులకు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. లేదంటే?

Purushottham Vinay
షుగర్ వ్యాధిగ్రస్తులకు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. లేదంటే?

షుగర్ : ప్రస్తుతం మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. అలాగే వారు కరోనా బారిన పడితే తీవ్రమైన న్యుమోనియాతో బాధపడుతూ ప్రాణాంతకమైన సమస్యని ఎదురుకునే ప్రమాదం ఉంది. షుగర్ సమస్య ఉన్నవారికి  బలహీనమైన రోగనిరోధక శక్తి ఉంటుంది. దాని కారణంగా వారు చాలా ఈజీగా అంటువ్యాధులు బారిన పడతారు. కరోనా మహమ్మారి కూడా అంటువ్యాధే కాబట్టి వారు సులభంగా కరోనాకు గురవుతారు. ఈ  నేపథ్యంలో మధుమేహ వ్యాధిగ్రస్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకోండి.షుగర్ పేషెంట్స్ వీలైనంత వరకు బయటికి వెళ్లడం మానుకోవాలి. తప్పనిసరిగా బయటకు వెళ్తే కచ్చితంగా వారు సామాజిక దూరాన్ని పాటించాలి. అలాగే మందులను ఖచ్చితంగా క్రమం తప్పకుండా తీసుకోవాలి. అలాగే డయాబెటీస్ మందులు తగినంత స్టాక్ పెట్టుకోవడం చాలా మంచిది.రక్తంలో చక్కెర శాతాన్ని క్రమం తప్పకుండా చెక్ చేయాలి. షుగర్ లెవెల్స్ పెరిగితే ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. 


అలాగే వైద్యుడిని సంప్రదించాలి.మందులు ఇంకా ఔషధాలను ప్రభుత్వం నిరంతరాయంగా సరఫరా చేస్తుంది. కాబట్టి, భయంతో మందులు ఇంకా సరఫరాలను ఎక్కువగా అస్సలు నిల్వ చేయవద్దు.ఇంకా అలాగే ఎలాంటి పరిస్థితుల్లో కూడా అస్సలు సొంత వైద్యం చేయకూడదు. ఏదైనా మందులను వాడే ముందు ఎల్లప్పుడూ వైద్యుడిని సంప్రదించడం చాలా మంచిది.ఇంకా ఈ కరోనా సమయంలో ఆరోగ్యకరమైన జీవనశైలిని నిర్వహించడం చాలా తప్పనిసరి. కాబట్టి మధుమేహం సమస్య ఉన్నవారు శారీరక శ్రమలు మానేసి వారి ఇంట్లోనే వ్యాయామం చేయాలి.అలాగే ప్రతిరోజూ కూడా ఖచ్చితంగా పోషకాహారం తీసుకోవాలి. ఇంకా అలాగే డీప్‌ఫ్రైడ్ ఫుడ్స్‌ను నివారించాలి. కరోనా వైరస్ నేపథ్యంలో తరచూ వైద్యుడికి టచ్ లో ఉంటూ షుగర్ లెవెల్స్ గురించి తెలియజేస్తే వారి ఆరోగ్యానికి చాలా మంచిది.కాబట్టి ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు పాటించండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: