గుండె పోటు: రాకుండా ఈ జాగ్రత్తలు తప్పనిసరి..?

Purushottham Vinay
గుండె పోటు: నేటి కాలంలో ఎవరికి ఏ నిమిషంలో గుండె పోటు వస్తుందో చెప్పలేం. అందుకే వంశపారపర్యంగా గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉన్నవారు సంవత్సరానికి ఒక్కసారైనా కార్డియాలజిస్ట్ ను సంప్రదించి ఖచ్చితంగా పరీక్షలు చేయించుకోవాలి. అలాగే రక్తపోటు పరీక్షలు ఇంకా లిపిడ్ ప్రొఫైల్ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ఇంకా మన ఆహారపు అలవాట్లల్లో కూడా అనేక మార్పులు చేసుకోవాలి. నూనెలో వేయించిన పదార్థాలను ఇంకా జంక్ ఫుడ్ ను అస్సలు తీసుకోకూడదు. సాయంత్రం పూట భోజనాన్ని త్వరగా చేయాలి. అలాగే ఈ భోజనంలో ఖచ్చితంగా సలాడ్స్, ఫ్రూట్స్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇవి చెడు కొలెస్ట్రాల్ ను ఈజీగా తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతాయి. అంతేగాక ఇవి రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడకుండా కూడా చేస్తాయి. ఇంకా గుండె ఆరోగ్యం మెరుగుపడేలా అలాగే రక్తపోటు అదుపులో ఉండేలా చేయడంలో పండ్లు, కూరగాయలు  ఎంతగానో ఉపయోగపడతాయి.


ఇక మధ్యాహ్నం పూట కార్బోహైడ్రేట్స్ కలిగిన ఆహారాలను ఖచ్చితంగా తక్కువగా తీసుకోవాలి. కార్బోహైడ్రేట్స్ వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా తయారవుతుంది. అన్నానికి బదులు రెండు పుల్కాలు లేదా జొన్న రొట్టె వంటి వాటిని తీసుకోవాలి. అవి కూడా ఎక్కువ కూరతో తీసుకోవాలి. అలాగే ఉదయం పూట అల్పాహారాలకు బదులుగా మొలకెత్తిన గింజలను, పండ్ల ముక్కలను ఇంకా నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ వంటి వాటిని ఖచ్చితంగా ఆహారంగా తీసుకోవాలి. ఎందుకంటే ఇవి శరీరంలో మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతాయి.అలాగే వీటితో పాటు వ్యాయామాలు చేయడం, యోగా ఇంకా ధ్యానం వంటివి రెగ్యులర్ గా చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల  గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.కాబట్టి ఖచ్చితంగా గుండె పోటు రాకుండా ఈ జాగ్రత్తలు పాటించండి. గుండె పోటు సమస్యలు రాకుండా ఈజీగా బయటపడి మిమ్మల్ని మీరు కాపాడుకొని సంపూర్ణ ఆరోగ్యంగా ఉండండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: