కప్ కాఫీతో ఈ భయంకర వ్యాధులు మాయం?

Purushottham Vinay
ఈ రోజుల్లో ఆహారపు అలవాట్లు ఇంకా జీవన శైలి కారణంగా చాలా మంది పలు రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.అలాంటి సమస్యల్లో మూత్రపిండాలు  దెబ్బ తినే సమస్య కూడా ఒకటి. ఈ సమస్యని లాస్ట్ స్టేజ్ వరకు గుర్తించకపోవడం వల్ల చాలా మంది త్వరగా ప్రాణాలు కోల్పోతున్నవారు కూడా ఉన్నారు. అందువల్లనే కిడ్నీల ఆరోగ్య పరిస్థితిని ముందుగానే పసిగట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణాలను కాపాడుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే తీవ్రమైన కిడ్నీ వ్యాధులతో బాధపడే వారు మాత్రం కాఫీని తాగితే అందులో ఉండే కెఫీన్ శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్‌ను రిలీజ్ చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇది కిడ్నీల పనితీరును  సరిచేస్తుంది. అందువల్ల కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వారు ఎప్పుడూ కూడా కాఫీని తాగితే ఖచ్చితంగా చాలా మంచి ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.కిడ్నీ సమస్య ఉన్న వారు కాఫీని ఎక్కువగా తాగడం వల్ల వారికి చనిపోయే అవకాశాలు కూడా 25 శాతం వరకు తగ్గుతాయట.


 అలాగే కాఫీ తాగడం వల్ల పలు ఇతర లాభాలు కూడా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాఫీని రోజూ తాగడం అలవాటు చేసుకుంటే చాలా వ్యాధులకు ఈజీగా చెక్ పెట్టవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శరీరంలో నొప్పులు ఇంకా వాపులను తగ్గించే గుణం కాఫీలోని కెఫీన్‌కు ఉంటుందట. అందుకే కాఫీని తాగడం వల్ల హైబీపీ సమస్య తగ్గుతుందని, రక్త నాళాలు మృదువుగా మారి బాగా పనిచేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.కాఫీ తాగడం వల్ల మెదడు కూడా చాలా యాక్టివ్‌గా మారుతుంది. రోజుకి 3 కప్పు కాఫీ తాగితే 65 శాతం వరకు మతిమరుపు వచ్చే అవకాశం ఈజీగా తగ్గుతుంది. కాఫీని రోజూ తాగడం వల్ల టైప్ 2 డయాబెటిస్ సమస్య వచ్చే అవకాశాలు తగ్గుతాయని కూడా పరిశోధకులు చెబుతున్నారు. ఇంకా అలాగే అధిక బరువును తగ్గించడంలో కూడా కాఫీ చాలా మెరుగ్గా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: