నువ్వుల వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసా..?

Divya
మన దేశంలో ప్రాచీన కాలం నుండి వాడుతున్న పదార్థాలలో నువ్వులు ఒకటి. నువ్వులు రుచిని మాత్రమే కాదు అపారమైన పోషకాలను కూడా అందిస్తాయి. నువ్వుల లో ఉండే సెసెమేన్ కాంపౌండ్ జాయింట్ పెయిన్ తగ్గించి మోకాళ్ళ యొక్క ఆర్థరైటిస్ లో మొబిలిటీని సపోర్ట్ చేస్తుంది. నువ్వుల ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
నువ్వులలో ఉండే కార్బోహైడ్రేట్లు, కొవ్వు పదార్థాలు విటమిన్ ఎ, సి, ఇ, బి 1, బి 2,బి 3, బి 6, బి 9  కాల్షియం, పొటాషియం, ఫాస్ఫరస్,మెగ్నీషియం, సోడియం,జింక్, ఐరన్ మొదలైన పోషకాలు మెండుగా ఉన్నాయి. నువ్వులు సాధారణంగా రెండు రకాలు.. నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు. ఈ రెండింటిలో కూడా అనేక రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. నువ్వుల నుండి నువ్వుల నూనె తయారు చేస్తారు. నువ్వులతో పాటు నువ్వుల నూనెలో కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. నువ్వుల నూనెలో ఒమేగా సిక్స్ ఫ్యాటీ ఆసిడ్స్, ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన పిండి పదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్నాయి. నువ్వుల నూనెతో తయారు చేసిన పదార్థాలు ఎక్కువగా నిల్వ ఉంటాయి.

స్త్రీలలో హార్మోన్ల సమస్యలకు నువ్వులు చక్కని పరిష్కారం. నువ్వులలో ఐరన్ ఎక్కువగా ఉండటం వలన రక్తాన్ని శుద్ధి చేసి ఆడవారిలో పీరియడ్స్ రెగ్యులర్ గా వస్తాయి.నువ్వులలో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వలన జీర్ణక్రియ వ్యవస్థ చాలా బాగా మెరుగుపడుతుంది. ప్రతిరోజు నువ్వులను తీసుకోవడం వలన అరుగుదల  బాగుంటుంది.  అలానే డైజేషన్ సమస్యలను దరిచేరనివ్వవు.
మధుమేహం ఉన్నవారికి నువ్వులు చాలా బాగా ఉపయోగపడతాయి. నువ్వులలో మెగ్నీషియం యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండడం వలన  రక్తంలోని చక్కర స్థాయిలను నియంత్రిస్తాయి.
నువ్వుల నూనె లో కాల్షియం మెండుగా ఉంటుంది.ఇది బలమైన ఎముకలు ఏర్పడటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది నువ్వుల నూనెలో కాపర్ జింక్ మరియు మెగ్నీషియం ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి చాలా దోహదపడతాయి.ఈ నూనెను అనేక ఆయుర్వేద ఎముకల మసాజ్ లో వాడతారు. ఈ నూనె చర్మంలోకి ఇంకిపోయి ఎముకలను బలంగా మార్చి, వయసుతోపాటు ఎముకల్లో వచ్చే బలహీనతలను  తొలిగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: