బాదంతో బోలెడు లాభాలు..తెలిస్తే వదలరు..?

Divya
పెద్ద మొత్తంలో పోషకాలు కలిగి ఉండే వాటిలో బాదంపప్పు చాలా విశిష్టమైనది. బాదం బయోటిన్, విటమిన్ ఇ,మెగ్నీషియం,కాపర్ మరియు ఫైబర్ వంటి ముఖ్యమైన పోషకాలను మరియు ప్రోటీన్స్ ఒమేగా 3,6 ఫ్యాటీ ఆమ్లాలను పుష్కలంగా కలిగి ఉంది.
అయితే బాదం పై ఉండే పొట్టు తీసి తినాలా? లేదా నేరుగా తినాలా? అనే సందేహాలు చాలామందిలో కలుగుతాయి.అయితే బాదంను పొట్టుతో పాటుగా తినడం వల్ల బాదాం లో ఉండే పోషకాలను మన శరీరం గ్రహించలేదు. నానబెట్టి పొట్టు తీసి తినడం ద్వారా త్వరగా జీర్ణం అవుతుంది.
బాదంలో ఉండే మోనో సాకరైడ్స్ ఆకలిని నియంత్రిస్తుంది..అందువల్ల పొట్ట నిండినట్లుగా అనిపించి తక్కువ ఆహారం తీసుకునే వీలు కలుగుతుంది. అందువల్ల బరువు తగ్గాలని అనుకునేవారు నానబెట్టిన బాదంలను తీసుకోవడం చాలా మంచిది. అంతేకాకుండా బాదం ఫైబర్ ను సమృద్ధిగా కలిగి ఉంటుంది. అది మన జీవక్రియను వేగవంతం చేసి తీసుకున్న ఆహారం తేలిగ్గా జీర్ణం అయ్యేలా చేసి జీర్ణక్రియ వ్యర్థాలను, టాక్సిన్లను శరీరం బయటకు విసర్జించడంలో సహాయ పడుతుంది.
బాదం మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్  పెరిగేందుకు సహాయ పడుతుంది. అందు వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. నానబెట్టిన బాదంలో ఉండే విటమిన్ ఇ లాంటి యాంటీ ఆక్సిడెంట్లగా పనిచేసి ఫ్రీ రాడికల్స్ భారీ నుండి మన శరీరాన్ని కాపాడుతాయి.
బాదం విటమిన్ ఇ ను సమృద్ధిగా కలిగి ఉంది. ఇది మన చర్మానికి అవసరమైన విటమిన్ ఇ ను అందించి ఆరోగ్యవంతమైన చర్మాన్ని ప్రసాదిస్తుంది. ఇది చర్మానికి ఒక మాశ్చరైజర్ లా పనిచేసి దేహ కాంతిని పెంచుతుంది. ముఖంపై ఏర్పడే నల్లటి మచ్చలను, ముడతలను తొలగించి మేనిఛాయను పెంచుతుంది.అలాగే జుట్టు సంభందిత సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు. అలాగే మరెన్నో సమస్యలను దూరం చేసుకోవచ్చు.కాబట్టి ఇలా ఎన్నో లాభాలు పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: