టమోటాలను అధికంగా తింటున్నారా.. అయితే సమస్యేనా..?

Divya
వంట చేయాలంటే ముందుగా గుర్తువచ్చే కూరగాయలలో టమాటా ఒక్కటీ. ఇది మనకు ప్రతి సీజన్ లో సులభంగా, తక్కువ ధరలో లభించే కూరగాయని చెప్పవచ్చు.పేదవాడు సైతం కొనగలిగే కూరగాయ ట‌మాటా, ఇవి లేకుండా ఏ కూర చేయ‌రు. ఇది కూరకు చ‌క్క‌ని రుచిని ఇస్తుంది.ట‌మాటా ప‌ప్పు, టమాటా కూర,పచ్చ‌డి, ర‌సం.. ఇలా అనేక రకాలుగా చేసి తింటుంటాము. ఇంత చవకయినా ట‌మాటా తిన‌డం వ‌ల్ల మ‌న‌ శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కళంగా లభిస్తాయి. ఇందులోని యాంటీ క్యాన్సర్ గుణాలు క్యాన్స‌ర్ వంటి ప్రాణాంత‌క వ్యాధులు రాకుండా నిరోదిస్తుంది. అలాగే రక్త ప్రసరణ సక్రమంగా జరిగి, బీపి ని కంట్రోల్ చేస్తుంది. మరియు రక్తంలోని చక్కెర స్థాయిలు క్రమభద్దికరించి,మధుమేహాన్ని నియంత్ర‌ణ‌లో ఉంచుతుంది.
ట‌మాటాల‌లో లుటీన్‌, లైకోపీన్ వంటి కెరోటినాయిడ్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కళంగా లభిస్తాయి.ఇవి కళ్ళ సమస్యలను దూరం చేస్తాయి.అలాగే వీటిని ఎక్కువగా తీసుకోవడం వ‌ల్ల ర‌క్తంలోని హిమోగ్లోబిన్ అధికంగా ఊత్పత్తి అయి, ర‌క్త‌హీన‌తను తగ్గిస్తుంది.సాధారణంగా ట‌మాటాల‌ను ప‌చ్చిగా లేదా వండుకుని ఎలాగైనా తిన‌వ‌చ్చు. వండుకుని తింటే యాంటీ ఆక్సిడెంట్ల శాతం పెరుగుతుంది. ప‌చ్చిగా తింటే విట‌మిన్ సి పుష్కళంగా ల‌భిస్తుంది. కానీ ట‌మాటాల‌ను ప‌చ్చిగా తింటే మాత్రం బాగా శుభ్రం చేసి తినాలి,

 లేదంటే పురుగు మందుల అవ‌శేషాలు మ‌న శ‌రీరంలోకి వెళ్ళి, అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి. అలాగే ట‌మాటాల‌ను ఉడికించినా.. ప‌చ్చిగా తిన్నా..అధిక మొత్తంలో తీసుకోరాదు. ట‌మాటాల‌ను అధికంగా తిన‌డం వ‌ల్ల కిడ్నీల్లో స్టోన్స్ ఏర్ప‌డే అవ‌కాశాలు ఎక్కువగా ఉంటాయి.మరియు నోరు, గొంతు స‌మ‌స్య‌లు, వాంతులు, విరేచ‌నాలు, త‌ల‌నొప్పి వంటి ఇత‌ర స‌మ‌స్య‌లు కూడా వ‌చ్చేందుకు అవ‌కాశాలు ఉంటాయి. క‌నుక ట‌మాటాల‌ను ప‌చ్చిగా లేదా ఉడ‌క‌బెట్టి.. ఎలా తిన్నా స‌రే మొతాదు మించకుండా తినాలి. లేదంటే తీవ్ర అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశాలు అధికంగా ఉంటాయి.కావున తక్కువ ధరకే వస్తున్నాయని అతిగా తినకూడదు. ఏ ఆహారమైన తీసుకున్న అతిగా తీసుకోకపోవడం మంచిది.అతి అనర్తమే కదా.. టమాటాలను జాగ్రత్తగా వాడి, ఆరోగ్యాంగా వుండండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: