నేరేడు ఆకులలో ఉండే.. ఈ పోషకాలు తెలుసా..?

Divya
నేరేడు పండ్లే కాదు, నేరుడు ఆకులు కూడా ఆరోగ్యానికీ చాలా బాగా ఉపయోగపడతాయి. ముదురు ఆకుపచ్చరంగులో ఉండే ఆకులలో యాంటీఆక్సిడెంట్స్, యాంటీవైరస్, యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా రక్తంలోని చక్కర స్థాయిలను క్రమబద్దీకరిస్తాయి.ఇందులోని పైబర్ గుణాలు మలబద్దకంను తగ్గిస్తుంది.ఈ ఆకులనుంచి తీసిన అయిల్ ను సబ్బులు, పెర్ఫ్యూమ్స్ వంటి సుగందాల తయారీలి ఉపయోగిస్తారు.నేరేడు ఆకులను ఎటువంటి వ్యాధులు కలవారు తీసుకుంటే మంచిదో ఇప్పుడు చూద్దాం..

కిడ్నీ స్టోన్స్ కరిగిస్తుంది:
ఈ నేరుడు ఆకులను రెండు లేదా మూడు తీసుకుని బాగా శుభ్రం చేసి , మూడు నల్లమిరియాలు వేసి జ్యూస్ లాగా చేయాలి.ఈ జ్యూస్ ను రోజుకు రెండు సార్లు తాగడం వల్ల,పొట్టలోని లోహపు ముక్కలతో పాటు కిడ్నీల్లోని రాళ్లను సులభంగా కరిగిస్తుంది.దంత సమస్యలతో బాధపడేవారు నేరేడు ఆకు రసాన్ని నోట్లో పోసుకుని పుక్కిలిస్తే చాలా మంచిది.
క్యాన్సర్ నిరోదిస్తుంది..
నేరుడు ఆకులలో ఉండే యాంటీక్యాన్సర్ గుణాలు శరీరం క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుతుంది.క్యాన్సర్ ని కలిగించే ప్రీ రాడికల్స్ ని నిరోదిస్తుంది.

అల్సర్..
అల్సర్ నొప్పి చాలా బాధాకరంగా ఉంటుంది. నొప్పినివారినిగా ఇతర మందులు మరియు ఆయిట్మెంట్ ఉపయోగించడానికి ముందు నేరేడు ఆకులను ఉపయోగించవచ్చు.అల్సర్ తో బాధపడేవారు రెండు మూడు ఆకులను తీసి గ్రైండ్ చేసి అందులో మజ్జిగ కలిపి, తరుచు తీసుకోవడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.
పైల్స్ ని నిరోదిస్తుంది..
పైల్స్‌ వ్యాధిని తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. నేరేడు ఆకులను ఉప్పు వేసి నమిలి తినడం వల్ల ఉదయాన్నే ఉప్పుతో ఉదయం పూట తింటే పైల్స్‌ పూర్తిగా తగ్గిపోతాయి. నేరేడు ఆకులు, పండ్లు, గింజలు, ఎండు లేదా పచ్చి బెరడు, వేరులను ఆయుర్వేద మందులలో ఎక్కువగా ఉపయోగిస్తారు.
హై ఫీవర్ తగ్గిస్తుంది..
జ్వరం వున్నప్పుడు,నేరేడు ఆకులను జ్యూస్ తీసుకోవడం వల్ల శరీరంలో వేడిని  తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది.
రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది..
ఇందులో వున్న పోషకాలు రక్తం చిక్కబడకుండా చేసి,శరీరంలో రక్తప్రసరణ మెరుగుపరుస్తాయి. దీనివల్ల  గుండె సంబంధిత రోగాలు దరిచేరవు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: