మీలో "జ్ఞాపకశక్తి" తగ్గుతోందా... భవిష్యత్తులో ఆ వ్యాధులు రావొచ్చు?

VAMSI
మన నిరంతర జీవితంలో ఎన్నెన్నో విషయాలు , సంఘటనలు మన ఇంట్లో లేదా మన చుట్టూ జరుగుతూ ఉంటాయి. అయితే వ్యక్తిగతంగా మనకు సంబంధించి ముఖ్యమైనవి మరియు గుర్తు పెట్టుకోవాల్సినవి చాలా ఉంటాయి. కానీ నేటి టెక్నాలజీ ఎంతగానో అభివృద్ధి చెందుతున్న సమయంలో పెద్ద వారిలో జ్ఞాపకశక్తి క్రమంగా తగ్గుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే ఇప్పటికిప్పుడు దీని వలన పెద్ద నష్టాలు జరగకపోయినా భవిష్యత్తులో మాత్రం అతి ప్రమాదకరమైన అల్జీమర్స్, డిమెన్సియా వంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఉన్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఇలా జరగకుండా మన జ్ఞాపకశక్తిని పెంచుకోవాలంటే కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందట. మరి అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
నిద్రించే సమయం : ఆరోగ్య నిపుణులు చెబుతున్న ప్రకారం పెద్ద వారు కనీసం 7 గంటలు పాటు నిద్రించాలట. జ్ఞాపకశక్తి మెరుగుపడాలి అంటే నిద్ర ఎక్కువగా ఉండాలి. రాత్రి మనము నిద్రించే సమయంలో న్యూరాన్లు మన మెదడులోని అవసరం లేని కొన్ని జ్ఞాపకాలను చెరిపివేయడానికి పనిచేస్తాయి. ఇక మెదడులోని మరో భాగం సినాప్సిస్ రేపటి మన కొత్త జ్ఞాపకాలను పొందుపర్చడానికి సహాయపడుతుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో నిద్రించే సమయాన్ని 7 నుండి 8 గంటల లోపు ఉండేలా చూసుకోవడం చాలా మంచిది.
వ్యాయామం: ప్రతిరోజూ ఉదయం మరియు సాయంత్రం ఒక అర గంట సేపు మీకు తెలిసిన వ్యాయామం చేస్తే జ్ఞాపకశక్తి వృద్ది చెందుతుంది అని పరిశోధనలో తేలింది. ఇక వ్యాయామం చేయడం వలన మన శరీరంలో మరియు మెదడులో రక్త ప్రసరణ బాగా జరిగి జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.
కొత్త విషయాలు నేర్చుకోవాలి: మనము రోజూ ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవాలి. ఇది మన జ్ఞాపకశక్తిని మెరుగుపరచడమే కాకుండా మనం చేసే పనిలో ఏకాగ్రత ఉండేలా చేస్తుంది. అంతే కాకుండా మెదడులో కొత్త న్యూరాన్ కనెక్షన్స్ లు ఏర్పడంలో కూడా సహాయపడుతాయి.
ఆహారం: మనము తీసుకునే ఆహారం వలన కూడా జ్ఞాపకశక్తిని పెంచుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా మెదడును ఉత్తేజపరిచే ఫుడ్ ను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వాల్ నట్స్, బ్రోకలీ, పసుపు, డార్క్ చాక్లెట్, తృణధాన్యాలు, గుడ్లు మరియు ఆకుకూరలను ఎక్కువగా తినాలట.
ఇక అన్నింటికన్నా ప్రధానమైన విషయం ఒకటి గుర్తుంచుకోవాలి.. చిన్న చిన్న తేదీలను గుర్తుపెట్టుకోవడానికి రిమైండర్ ల పేరిట టెక్నాలజీ ని వాడడం మంచిది కాదు. ఆలా చేయడం వలన ఆటోమెటిక్ గా మీ మెదడు మొద్దు బారిపోయి జ్ఞాపకశక్తి క్షీణిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: