ఉదయం మీకు ఈ అలవాటు వుందా? ఆరోగ్యం చేసినట్లే?

Purushottham Vinay
చాలా మందికి కూడా ఉదయం పూట ఖాళీ కడుపుతో కాఫీ తాగే అలవాటు చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ అలా తీసుకోకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా స్త్రీలు మాత్రం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం పూర్తిగా మానుకోవాలి. దీనికి మొదటి కారణం ఉదయం పూట ఖాళీ కడుపుతో కాఫీ తాగడం వల్ల శరీరంలో కార్టిసాల్ హార్మోన్ (స్ట్రెస్ హార్మోన్) లెవెల్ పెరుగుతుంది. ఇది అండోత్సర్గము, బరువు ఇంకా అలాగే హార్మోన్లపై చెడు ప్రభావాన్ని చూపుతుంది.ఒత్తిడి హార్మోన్ల స్థాయి ఉదయం పూట ఎక్కువగా ఉంటుంది. సాయంత్రం పూట తక్కువగా ఉంటుంది.ఇలాంటి పరిస్థితిలో, మీరు పొద్దున్నే కెఫీన్ తీసుకున్నప్పుడు, కార్టిసాల్ స్థాయి తక్కువగా ఉండటానికి బదులుగా బాగా పెరుగుతుంది.కార్టిసాల్ హార్మోన్ మన శరీరానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కానీ, మీరు బాగా స్ట్రెస్ లో ఉన్నప్పుడు, కార్టిసాల్ హార్మోన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది మీ రక్తంలో షుగర్ లెవెల్ ని పెంచుతుంది.


అలాగే ఇన్సులిన్ హార్మోన్ను పెంచుతుంది.అధిక కార్టిసాల్ అనేది బరువు పెరగడానికి ఇంకా అలాగే నిద్ర సంబంధిత సమస్యలకు కూడా దారి తీస్తుంది.పొద్దున్నే నిద్రలేచిన వెంటనే ఖాళీ కడుపుతో నీరు తాగడం వల్ల మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పొద్దున  మీరు మేల్కొని ఉన్నప్పుడు మీరు నీటిని తాగుతారు. కానీ, రాత్రి నిద్రపోయిన తర్వాత, నిద్రలో దాహం లేకపోవడం వల్ల, శరీరంలో నీటి కొరత అనేది వస్తుంది. అలాంటి పరిస్థితిలో, మీరు నీటిని తీసుకోవడం చాలా అవసరం.మీరు పొద్దున మేల్కొన్న వెంటనే, మీ శరీరం బాగా పని చేస్తుంది.మీరు ఉదయాన్నే 2 నుంచి 3 గ్లాసుల నీటిని తాగడం చాలా ముఖ్యం. నీళ్లు తాగిన తర్వాత, మీరు కాఫీ లేదా టీ ఏదైనా తినవచ్చు. ఉదయం పూట నిద్రలేచిన వెంటనే సాధారణ నీటిని తాగే అలవాటు మీకు లేకుంటే అందులో కొద్దిగా నిమ్మరసం ఇంకా తేనె కలుపుకుని తాగండి. పొద్దున్నే లెమన్ వాటర్ తాగడం వల్ల బరువు తగ్గడంతోపాటు రోజంతా కూడా ఫ్రెష్ గా ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: