మధుమేహంతో విసిగిపోయారా.. ఈ డ్రై ఫ్రూట్ తో చెక్ పెట్టండి..!!

Divya
ఈ మధ్య కాలంలో ప్రతి ఇంటికి ఒకరు మధుమేహంతో బాధపడుతున్నారంటే సందేహం లేదు.దానికి కారణం మన ఆహారపు అలవాట్లు, జీవనశైలి క్రమంగా మారుతూ ఉండడమే. పూర్వం మన భారతదేశపు అలవాట్లు ఎంతో ఆరోగ్యకరంగా ఉండేవి.విదేశీఅలవాట్లు మన భారతదేశాన్ని చుట్టూ ముట్టడంతో క్రమంగా మన దేశంలో అనారోగ్యాల రేటు పెరుగుతూ వస్తోంది. ముఖ్యంగా మధుమేహం అనేది ఎక్కువగా ప్రబలతోంది. ఈ మధుమేహాని తగ్గించుకోలేక చాలామంది విసిగిపోతూ ఉన్నారు. దీనికి ఇంగ్లీష్ మందులు వాడుతూ అనేక దుష్ప్రభావాలను కొనితెచ్చుకుంటూ ఉన్నారు. కానీ కొన్నిరకాల ఆహారాలతో మధుమేహానికి చెక్ పెట్టొచ్చు.వాటిలో ముఖ్యంగా వాల్నట్స్ చాలా బాగా ఉపయోగపడతాయి.అవి ఎలా ఉపయోగపడతాయో ఇప్పుడు చూద్దాం..
 వాల్ నట్  తినడానికి అంత రుచికరమైనదే కాదు. కానీ ఇందులో శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు పుష్కళంగా ఉన్నాయి. వీటిని తరుచూ తీసుకోవడం వల్ల, ఫైబర్, విటమిన్లు,ప్రోటీన్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్, కాపర్, సెలీనియం, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి పోషకాలు శరీరాన్ని దృఢంగా మారుస్తాయి.వాల్‌నట్‌లను తగినంత తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి . షుగర్ పేషెంట్లు వాల్‌నట్‌లను నానబెట్టి రోజూ ఉదయాన్నే తినడం వల్ల మధుమేహాన్ని తగ్గించుకోవచ్చు.
వాల్‌నట్‌లు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సహాయపడతాయి. వాల్ నట్స్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. సాధారణంగా ఫైబర్ విచ్ఛిన్నం అయి,జీర్ణం అవడానికి చాలా సమయం పడుతుంది. ఇది రక్తప్రసరణలో చక్కెరస్థాయి హెచ్చు తగ్గులను కంట్రోల్ లో ఉంచుతుంది.
మధుమేహంతో బాధపడేవారు ఈ డ్రై ప్రూట్ ని సలాడ్‌లు, స్మూతీస్ లేదా వాటి తృణధాన్యాలలో కలపడం ద్వారా వీటిని రోజూవారి డైట్ లో చేర్చుకోవడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది.
అంతే కాక వాల్‌నట్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో ఉన్న ఫైబర్ కంటెంట్ జీర్ణశక్తిని మెరుగుపరిచి, మలబద్ధకం, గ్యాస్ అసిడిటీ వంటి రోగాలను దూరం చేస్తుంది .మరియు అధికబరువును తగ్గిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: