కిడ్నీ స్టోన్స్ ని ఈజీగా కరిగించే హోమ్ రెమెడీస్?

Purushottham Vinay
చాలా మంది కూడా రోజు సరిగ్గా నీళ్లు తాగరు. అలాగే మూత్రాన్ని కూడా ఆపుకుంటారు. కానీ అది ఏమాత్రం ఆరోగ్యానికి మంచిది కాదు. అలా చేస్తే ఖచ్చితంగా కిడ్నీ స్టోన్స్ సమస్య వస్తుంది. ఇక మూత్రపిండాల్లో రాళ్ల కారణంగా విపరీతమైన నొప్పి ఇంకా మూత్రం సరిగ్గా రాకపోవడం వంటి సమస్యలు ఎక్కువగా తలెత్తుతాయి. అందుకే ఈ సమస్యను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. ఏముందిలే చిన్న సమస్యే కదా అని తేలికగా మాత్రం తీసుకుంటే ఖచ్చితంగా మీ ప్రాణానికే ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. ఇక మూత్రపిండాల్లో చిన్నగా ఉండే ఈ రాళ్లను మనం కొన్ని హోం రెమెడీస్ ఉపయోగించి తొలగించుకోవచ్చు.అయితే ఒక్క విషయం గుర్తుంచుకోండి.ఇప్పుడు చెప్పబోయే చిట్కా కిడ్నీల్లో చిన్న స్టోన్స్ ఉన్న వారే పాటించాలి. పెద్ద స్టోన్స్ ఉంటే డాక్టర్ ని సంప్రదించాలి.మూత్రపిండాల్లో రాళ్లను కరిగించడంలో  మెంతుల నీళ్లు చాలా బాగా ఉపయోగపడతాయి. ప్రతి రోజూ రాత్రి ఒక గ్లాస్ నీటిలో ఒక టీ స్పూన్ మెంతులను వేసి రాత్రంతా కూడా నానబెట్టాలి. పొద్దున్నే ఈ నీటిని తాగి మెంతులను తినాలి.


ఇలా చేయడం వల్ల  మూత్రపిండాల్లో రాళ్ల సమస్య ఈజీగా తగ్గుతుంది. ఇంకా అలాగే అరటి చెట్టు బెరడును  కూరగా వండుకుని తినడం వల్ల కూడా మూత్రపిండాల్లో రాళ్ల సమస్య నుండి చాలా ఈజీగా బయటపడవచ్చు.ఇంకా అదేవిధంగా మనం వంటల్లో ఉపయోగించే కొత్తిమీర కూడా మూత్రపిండాల్లో రాళ్లను తొలగించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది.అలాగే కొత్తిమీరను నీటిలో వేసి కషాయంలా చేసుకోని తరువాత ఈ కషాయాన్ని వడకట్టి గ్లాస్ లోకి తీసుకుని  తాగడం వల్ల కూడా మనం ఖచ్చితంగా మంచి ఫలితాలను పొందవచ్చు. ఇంకా మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో బాధపడే వారు నేరేడు పండును ఎక్కువగా తీసుకోవాలి.  రోజుకు రెండు లేదా మూడు నేరేడు పండ్లను తినడం వల్ల  మనం చాలా ఈజీగా మూత్రపిండాల్లో రాళ్లను కరిగించుకోవచ్చు. మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో బాధపడే వారు ఈ టిప్స్ పాటించడం వల్ల ఖచ్చితంగా చక్కటి ఫలితాలను పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: