దోమల బెడదని తగ్గించే న్యాచురల్ టిప్?

Purushottham Vinay
ప్రతి ఇంట్లో కూడా దోమల బెడదా ఎక్కువ ఉంటుంది. ఈ దోమలు మనల్ని భయంకర జబ్బులకి గురి చేస్తాయి. దోమల కారణంగా డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా వంటి రకరకాల వైరల్ ఫివర్స్ వస్తూ ఉంటాయి. అయితే చాలా సింపుల్ గా కేవలం ఒక చిన్న చిట్కాను ఉపయోగించి మనం దోమల సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చు.దోమల బెడదను తగ్గించే వివిధ రకాల ప్రొడక్ట్స్  వాడడం వల్ల దోమల బెడద తగ్గినప్పటికి ఎన్నో రకాల దుష్ప్రభావాల బారిన పడాల్సి ఉంటుంది. ఎందుకంటే వీటిలో చాలా రకాల రకాల రసాయనాలను వాడుతూ ఉంటారు. వీటి వల్ల జలుబు, తలనొప్పి, తుమ్మలు, దురద ఇంకా అలాగే అలర్జీ వంటి వివిధ రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. పూర్వకాలం నుండి ఎన్నో రకాల టిప్స్ ఉపయోగించి సహజ సిద్దంగా దోమల బెడదని తగ్గించుకుంటున్నారు.ఇక అలాంటి చిట్కాల్లో దోమలను నివారించే సులభమైన చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి మనం కర్పూరం, వేప నూనె, వెల్లుల్లి రెబ్బలు అవసరం.ముందుగా మీరు ఒక రోట్లో వెల్లుల్లి రెబ్బలను ఇంకా కర్పూరం బిళ్లలను వేసి వాటిని కచ్చా పచ్చాగా దంచుకోవాలి.ఆ తరువాత ఈ మిశ్రమాన్ని ఒక ప్రమిదలోకి లేదా కొబ్బరి చిన్నలోకి ఇంకా అడుగు మందంగా ఉండే ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అలాగే తరువాత ఈ మిశ్రమంపై నూనెను వేసి దాన్ని వెలిగించాలి. ఇలా వెలిగించడం వల్ల దీని నుండి వచ్చే ఘూటు వాసన వల్ల దోమలు చాలా ఈజీగా బయటకు పోతాయి. ఇంకా అంతేకాకుండా దీని నుండి వచ్చే పొగ కారణంగా ఇంట్లో క్రిములు ఇంకా కీటకాలు కూడా నశిస్తాయి. ఈ టిప్ ని పాటించడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాల బారిన పడము.దీనివల్ల ఇంట్లో చక్కటి వాతావరణం నెలకొంటుంది. అలాగే ఈ టిప్ పాటిస్తూనే ఇంటి చుట్టుపక్కల శుభ్రంగా ఉంచుకోవాలి.ముఖ్యంగా నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: