మొలకేత్తిన వేరుశెనగ విత్తనాలలో ప్రయోజనాలు మీకు తెలుసా..?

Divya
సాధారణంగా మధ్య తరగతి వారికి బాదాం తినడం అంటే ఖర్చుతో కూడుకున్న పని. కావున ప్రతి ఒక్కరూ బాదాం కొని తినలేరు, కాబట్టి బాదాం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలనే మెలకేత్తిన వేరుశనగల్లో పొందవచ్చని ఆహార నిపుణులు చెబుతున్నారు.మొలకేత్తిన పల్లిలలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.అంతేకాక అందరికీ ఇవి తక్కువ ధరలోనే లభిస్తాయి. అందుకే పల్లీలను 'పేదవాడి బాదాం' అని అంటారు.పైగా పల్లీలను చిన్నపెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారు. అలాంటి మొలకేత్తిన పల్లిల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం..

గుండె ఆరోగ్యానికి..
మొలకెత్తిన వేరుశెనగ ముఖ్యంగా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.ఇందులో ఉండే మెగ్నీషియం, పొటాషియం వంటి మూలకాలు రక్తప్రసరణ క్రమంగా జరిగేందుకు దోహదపడతాయి.వీటిని రోజూ గుప్పెడు చొప్పున తీసుకుంటూ ఉంటే గుండెను ఆరోగ్యంగా ఉంచే ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కళంగా లభిస్తాయి.
బరువు తగ్గడానికి..
మొలకెత్తిన వేరుశనగ కొన్ని తిన్న ఎక్కువగా తిన్న పీలింగ్ వస్తుంది. అందువల్ల వేరే పదార్థాలను తినాలి అనే కోరిక తగ్గుతుంది. దానితో బరువు తగ్గుతారు. అంతే కాక బీపి, కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా తగ్గిస్తుంది.
మలబద్ధకం నివారణకు..
వీటిలో ఫైబర్ కంటెంట్ పుష్కళంగా ఉంటుంది, ఇది జీవక్రియను వేగవంతం చేస్తుంది. ఇందులోని ఫైబర్  జీర్ణవ్యవస్థను మెరుగుపరిచి, కడుపును శుభ్రంగా ఉంచుతుంది. మలబద్ధకంను నివారిస్తుంది.
మధుమేహం నియంత్రించడానికి..
మొలకెత్తిన వేరుశనగలో ఒమేగా త్రి ఫ్యాటీ యాసిడ్స్ మరియు మెగ్నీషియం అధికంగా లభిస్తాయి. డయాభేటీస్ ఉన్నవారు మొలకెత్తిన వేరుశనగలను మొతాదులో తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి.
కీళ్ల నొప్పులు తగ్గించడానికి..
కీళ్ల నొప్పులతో ఇబ్బందిపడేవారు ప్రతిరోజూ గుప్పెడు మొలకెత్తిన వేరుశనగ తినడం ద్వారా కీళ్ళ నొప్పులను తగ్గించుకోవచ్చని ఆహార నిపుణులు సూచిస్తున్నారు. వీటిలో లభించే కాల్షియం ఎముకలను దృఢంగా ఉండేందుకు సహాయపడుతుంది.
అందువల్ల పేదవాడి బాదాం అయిన మొలకెత్తిన వేరుశనగను రోజువారీ డైట్ లో చేర్చుకుంటే చాలా మంచి ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: