మైగ్రేన్‌ బాధితులు ఇవి అస్సలు తినకూడదు?

Purushottham Vinay
మైగ్రేన్‌ బాధితులు ఈరోజుల్లో చాలా ఎక్కువ అవుతున్నారు. ఆ సమస్యతో బాధ పడేవారు ఖచ్చితంగా తినే ఫుడ్ విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఇక వారు ఏం తినాలో, వేటికి దూరంగా ఉండాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మైగ్రేన్‌ సమస్యతో బాధ పడేవారికి అరటిపండు చాలా మేలు చేస్తుంది. ఈ పండుని తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. ఇంకా అలాగే ఇందులో పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. పొటాషియం చాలా ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది. ఇంకా అదే సమయంలో, మెగ్నీషియం చాలా ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెరను కూడా ఈజీగా నియంత్రించవచ్చు. ఇంకా అలాగే మెగ్నీషియం మైగ్రేన్‌ బాధితులకు కూడా చాలా మేలు చేస్తుంది.డార్క్ చాక్లెట్ ఆరోగ్యానికి చాలా విధాలుగా మేలు చేస్తుంది.ఇది అనేక వ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. అయితే మైగ్రేన్‌ బాధితులు మాత్రం ఈ డార్క్‌ చాక్లెట్‌ను అస్సలు తీసుకోకూడదు.ఎందుకంటే దీని ఉపయోగం మైగ్రేన్ ప్రమాదాన్ని పెంచుతుంది.


డార్క్ చాక్లెట్ తినడం వల్ల మైగ్రేన్ వచ్చే ప్రమాదం చాలా పుష్కలంగా ఉందని ఒక అధ్యయనంలో తేలింది.ముఖ్యంగా మద్యం మాత్రం అసలు సేవించవద్దు. ఇది ఆరోగ్యానికి అసలు ఏ మాత్రం కూడా మంచిది కాదు. ఆల్కహాల్ ఆరోగ్యంపై ఖచ్చితంగా చెడు ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా మైగ్రేన్ బాధితులు అయితే అసలు ఈ మద్యం సేవించకూడదు. ఇది ఖచ్చితంగా సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది.ఇక సాధారణంగా టీ , కాఫీ తాగడం వల్ల ఒత్తిడి ఇంకా అలాగే ఆందోళన తగ్గుతుందని చెబుతారు.అయితే మైగ్రేన్ బాధితులు టీ, కాఫీలను అస్సలు తాగకూడదు.ఎందుకంటే వీటిలో కెఫిన్ అనేది పుష్కలంగా ఉంటుంది. ఇది మైగ్రేన్ సమస్యను చాలా ఈజీగా పెంచుతుంది.ఇక ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, సీఫుడ్ తీసుకోవడం వల్ల మైగ్రేన్ రిస్క్ అనేది తగ్గుతుంది.అలాగే చేపల్లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ మైగ్రేన్‌ బాధితులకు చాలా రకాలుగా మేలు చేకూరుస్తుంది. అలాగే మైగ్రేన్ సమస్య ఉన్నవారు వారానికి కనీసం రెండుసార్లు సీఫుడ్ ని తినాలి. అలాగే అదనంగా ఆకుపచ్చ కూరగాయలు ఇంకా అలాగే విటమిన్-సి లేని పండ్లు తీసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: