ఉదయం పరగడుపున ఈ నీరు తాగితే బోలెడు లాభాలు?

Purushottham Vinay
ఇక ఒక గ్లాస్ లో గోరు వెచ్చని నీటిని తీసుకోని ఆ తరువాత ఈ నీటిలో పావు టీ స్పూన్ పసుపును వేసి కలపాలి.ఇలా రెడీ చేసుకున్న నీటిని రోజూ ఉదయం పరగడుపున తాగి వెంటనే రెండు మిరియాలను నమిలి తినాలి.అయితే ఇలా మిరియాలను తినలేని వారు పసుపు నీటిలోనే చిటికెడు మిరియాల పొడిని బాగా కలిపి తాగాలి. ఇలా తయారు చేసుకున్న నీటిని రోజూ ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల కలిగే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇక ఇలా పసుపు, మిరియాల పొడిని కలిపి తీసుకున్న నీటిని తాగడం వల్ల జీర్ణశక్తి చాలా బాగా మెరుగుపడుతుంది. శరీరంలోని వ్యర్థాలు ఇంకా అలాగే విష పదార్థాలు తొలగిపోతాయి.శరీరంలో జీవక్రియల రేటు కూడా బాగా పెరుగుతుంది.చర్మం పై ఉండే మొటిమలు ఇంకా మచ్చలు ఈజీగా తగ్గుతాయి.ఇంకా మీ చర్మం కూడా కాంతివంతంగా తయారవుతుంది. అలాగే ఈ నీటిని తీసుకోవడం వల్ల గాయాలు ఇంకా పుండ్లు కూడా త్వరగా మానుతాయి. శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ కూడా ఈజీగా తొలగిపోతుంది. రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వు కూడా ఈజీగా కరిగిపోయి రక్తనాళాలు శుభ్రంగా మారుతాయి. దీంతో గుండె సంబంధిత సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి.


అంతేకాకుండా ఈ నీటిని తీసుకోవడం వల్ల పలు రకాల క్యాన్సర్ లు వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. అలాగే పసుపును ఇంకా మిరియాలను కలిపి తీసుకోవడం వల్ల అల్జీమర్స్ వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. కీళ్ల నొప్పులు ఇంకా వాపులతో బాధపడే వారు ఇలా పసుపు, మిరియాల పొడి కలిపిన నీటిని తీసుకోవడం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది.ఇక వీటిలో సహజ సిద్దమైన యాంటీ ఇన్ ప్లామేటరీ లక్షణాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. ఇవి నొప్పులను తగ్గించడంలో బాగా ఉపయోగపడతాయి. అలాగే ఈ నీటిని తీసుకోవడం వల్ల అధిక బరువు సమస్య నుండి కూడా చాలా ఈజీగా బయటపడవచ్చు. ఇంకా అంతేకాకుండా ఈ నీటిని తీసుకోవడం వల్ల షుగర్ స్థాయిలు కూడా నియంత్రణలో ఉంటాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి ఇన్ఫెక్షల బారిన పడకుండా ఉంటాం. ఈ విధంగా రోజూ ఉదయం పరగడుపున పసుపు ఇంకా మిరియాల పొడి కలిపిన నీటిని తాగడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: