తాటి తెగలలో ఇన్ని పోషకవిలువలా..తెలిస్తే అస్సలు తినకుండా వదలరు..!

Divya
తాటితేగ నిండా శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. తాటిచెట్టులో ప్రతిభాగము అందరికీ ఉపయోగపడేదే. ముఖ్యంగా తాటిపండ్లు రోజూవారి ఆహారంలో,నలభై రోజులు పాటు తింటే శరీరానికి మంచి రంగు వస్తుంది.తాటిపండ్ల గుజ్జుతో తాటితాండ్ర చేస్తారు. తాటికల్లుతో తాటిబెల్లం తయారుచేసి బాలింతరాలికి పెడితే చాలామంచిది.తాటిపండ్లను తిన్న తరువాత పడివేయకుండా ఆ బుర్రలను మట్టిలో పాతిపెడితే తేగలు తయారవుతాయి. ఈ తేగలను కాల్చి తింటుంటారు.తేగను తినేందుకు చాలామంది ఇష్టపడరు. కానీ వాటివల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు.
తేగలు వల్ల కలిగే ఆరోగ్యప్రయోజనాలు..
తేగలు తింటే అధికబరువు తగ్గడంతోపాటు కాన్సర్ ను సైతం దూరం చేస్తుంది. అలాగే తేగలను బాగా ఉడికించి చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకుని పిండికొట్టి, కొబ్బరిపాలు, బెల్లం, ఏలకులపొడి చేర్చి తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ ఈజీగా కరిగిపోతుంది. తేగలను  పిండిలా చేసి రొట్టెలను చేసుకుని కూడా తినవచ్చు. ఇందులో పైబర్, కాల్షియం, ఫాస్పరస్, ధాతువులు మరియు విటమిన్ b1, b2, b6 అధికంగా లభిస్తాయి.
తేగలను తరుచుగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికే కాకుండా అందానికి కూడా చాలామేలు చేస్తాయి. ఇందులోని పైబర్ జీర్ణక్రియను మెరుగుపరిచి పెద్దపేగుల్లో మలినాలను రిమూవ్ చేస్తుంది.టాక్సిన్లను తొలగిస్తుంది. ఇందులోని కాల్షియం ఎములకు బలాన్నిస్తాయి. మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. రక్తంలో తెల్లకణాలను వృద్ధి చేస్తుంది. ఆకలిని నియంత్రించే శక్తి తేగలకు వుండటంతో అధిక ఆహారం తీసుకోవడం తగ్గుతుంది. శరీరానికి చలువనిచ్చి, నోటిపూతను తగ్గిస్తుంది. తేగలను పాలలో ఉడికించి ఆ పాలను చర్మానికి పూతలా రాసుకుంటే చర్మం అందంగా తయారవుతుంది.పిల్లల్లో ఎముకల ఎదుగుదలకు బాగా సహాయపడుతుంది. ఫైబర్ సమృద్ధిగా వుండటంవలన రక్తంలో కొలెస్ట్రాల్ కరిగించి దాంతో గుండె జబ్బులు వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది.తేగలను డయాభేటీస్ వున్నవారు కూడా సంతోషంగా తీసుకోవచ్చు. ఇది రక్తంలో షుగర్ లెవెల్స్ ని నియంత్రించి మధుమేహం కంట్రోల్గా ఉండేలా చేస్తుంది. రక్తంహీనతతో బాధపడుతున్నవారు తరుచుగా తేగలను తీసుకుంటూ ఉంటే రక్తకణాలు వృద్ధి చెందుతాయి. చర్మవ్యాధులు, కాలేయ వ్యాధులు రాకుండా సహాయపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: