ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరగాలంటే ఇలా చెయ్యండి?

Purushottham Vinay
ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరగాలంటే రెగ్యులర్ గా ధ్యానం చెయ్యండి. రెగ్యులర్ గా ధ్యానం చెయ్యడం అనేది మిమ్మల్ని మానసికంగా చాలా ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే ఇది మనస్సును శాంతింపజేస్తుంది.ఇంకా ఈ ధ్యానం మీ ఒత్తిడిని కూడా ఈజీగా తగ్గిస్తుంది. ఇంకా అలాగే ఏకాగ్రతను పెంపొందించడానికి కూడా ఎంతగానో తోడ్పడుతుంది.అలాగే తులసి కూడా జ్ఞాపక శక్తికి చాలా మంచిది. తులసి మూలికలలో చాలా మంచిదిగా పరిగణించబడుతుంది. తులసి ఆయుర్వేదంలో ఆరోగ్య ప్రయోజనాలకు ఎంతగానో ప్రసిద్ధి చెందింది. ఇది ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. ఇది యాంటీబయాటిక్, యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్ ఇంకా అలాగే యాంటీ కార్సినోజెనిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇంకా అలాగే ఇది ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను తొలగించడానికి పనిచేస్తుంది. జ్ఞాపకశక్తి, ఏకాగ్రతను మెరుగు పరచడానికి తులసి చాలా బాగా పనిచేస్తుంది. దీని కోసం మీరు 5 నుంచి 10 తులసి ఆకులు, 5 బాదం ఇంకా అలాగే 5 నల్ల మిరియాలు తీసుకొని వాటిని తేనెతో కలిపి తినవచ్చు. ఇది మెమరీ పవర్ ని పెంచడంలో ఎంతగానో సహాయపడుతుంది.

ఇంకా అశ్వ గంధ ఒక పురాతన, సంప్రదాయ ఔషధ మూలిక. కొన్ని యుగాలుగా దీనిని ఔషధంగా ఉపయోగిస్తున్నారు. శారీరక రుగ్మతలను తొలగించడంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా ఇది కాపాడుతుంది. అశ్వగంధ మానసిక ఇంకా అలాగే శారీరక ఒత్తిడిని తగ్గించడానికి చాలా బాగా పనిచేస్తుంది. అశ్వగంధ మెదడులోని ఆక్సీకరణ ఒత్తిడిని కూడా ఈజీగా తగ్గిస్తుంది.ఇది జ్ఞాపకశక్తి సామర్థ్యాన్ని పెంచడమే కాక మెదడు వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి కూడా పనిచేస్తుంది.మీరు పాలు, నీరు ఇంకా తేనె నెయ్యితో కలిపి దీనిని తీసుకోవచ్చు.ఇంకా అలాగే ఆయుర్వేద వైద్యంలో శంఖపుష్పి మూలికలు చాలా విలువైనవి. ఇది మనస్సును శాంతపరచడానికి ఇంకా జ్ఞాపకశక్తిని పెంచడానికి బాగా ఉపయోగించబడుతుంది. ఇది ఒత్తిడి ఇంకా అలాగే ఆందోళనను తగ్గించడానికి బాగా పనిచేస్తుంది. దీని కోసం మీరు గోరువెచ్చని నీటిలో టీస్పూన్ ఈ మూలికా పొడిని కలిపి తీసుకుంటే ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: