ఇది తాగితే షుగర్ జబ్బు మాయం.. ఇక రానే రాదు?

Purushottham Vinay
షుగర్ జబ్బు ప్రస్తుత కాలంలో సర్వసాధారణమైన వ్యాధిగా మారిపోయింది.మన శరీరంలో క్లోమ గ్రంథి సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఈ జబ్బు తలెత్తుతుంది. మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్లు ఇంకా అలాగే మానసిక ఒత్తిడి ఈ వ్యాధి రావడానికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.ఇంకా అలాగే వంశపారపర్యంగా కూడా కొందరు ఈ షుగర్ వ్యాధి బారిన పడుతుంటారు. షుగర్ వ్యాధి కారణంగా మనకు ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఎక్కువగా ఉంది.అయితే మన ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలతో కషాయాన్ని చేసుకుని తీసుకోవడం వల్ల కూడా మనం షుగర్ వ్యాధిని చాలా ఈజీగా నియంత్రణలో ఉంచుకోవచ్చు. షుగర్ సమస్యతో బాధపడే వారికి ఈ కషాయం ఎంతగానో ఉపయోగపడుతుంది. షుగర్ జబ్బుని నియంత్రించే ఈ కషాయాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇందుకోసం ముందుగా ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీటిని తీసుకోవాలి.


ఆ నీళ్లు వేడయ్యాక ఇందులో ఒక టీ స్పూన్ మెంతులను వేయాలి. తరువాత ఇందులో రెండు రెమ్మల కరివేపాకును ఇంకా అలాగే ఒక చిన్న అల్లం ముక్కను వేయాలి.అంతా అయిపోయాకా ఇందులో ఒక ఇంచు దాల్చిన చెక్క ముక్కను వేయాలి. తరువాత ఈ నీటిని ఒక గ్లాస్ కషాయం అయ్యే వరకు బాగా మరిగించాలి. తరువాత ఈ నీటిని వడకట్టి గోరు వెచ్చగా అయ్యే దాకా ఉంచాలి. ఇలా తయారు చేసుకున్న కషాయాన్ని రోజూ ఉదయం పూట పరగడుపున తాగాలి. దీనిని తీసుకున్న తరువాత అర గంట వరకు అసలు ఎలాంటి ఆహారాన్ని తీసుకోకూడదు. ఈ విధంగా కషాయాన్ని తయారు చేసి తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి ఖచ్చితంగా నియంత్రణలో ఉంటుంది. ఇంకా అంతేకాకుండా ఈ కషాయాన్ని తాగడం వల్ల షుగర్ వ్యాధి వల్ల కలిగే ఇతర అనారోగ్య సమస్యల నుండి కూడా ఉపశమనం కలుగుతుంది. దీనిని తాగడం వల్ల షుగర్ వ్యాధి నియంత్రణలో ఉండడంతో పాటు ఫ్యూచర్ లో కూడా రాకుండా ఉంటుంది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: