దగ్గు నుంచి విముక్తి పొందే సింపుల్ టిప్?

Purushottham Vinay
దగ్గు సమస్య ఎంత దారుణంగా వేధిస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే మనం ఈజీగా దాన్ని తగ్గించుకోవచ్చు. అయితే అందుకోసం మనం ఖచ్చితంగా అల్లం, తేనె, నిమ్మరసాన్ని వాడాల్సి ఉంటుంది. అల్లంలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. జీర్ణక్రియను మెరుగుపరిచే ఎన్నో ఔషధాల్లో అల్లాన్ని చాలా ఎక్కువగా ఉపయోగిస్తారు.ఈ అల్లాన్ని వాడడం వల్ల దగ్గు, జులుబు, విరోచనాలు, వాంతులు, అజీర్తి వంటి ఎన్నో రకాల సమస్యల నుండి చాలా ఈజీగా ఉపశమనాన్ని పొందవచ్చు. దగ్గును తగ్గించడంలో నిమ్మకాయ మనకు ఎంతగానో సాయపడుతుంది. దీనిలో శరీరాన్ని, చర్మాన్ని ఆరోగ్య పరిచే గుణాలు చాలానే ఉన్నాయి. ఇంకా అలాగే స్వచ్ఛమైన తేనెలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. తేనెను వాడటం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి ఇన్ఫెక్షన్ ల బారిన పడకుండా ఉంటాం. ఈ టిప్ ని తయారు చేసుకోవడానికి ముందుగా అల్లాన్ని తీసుకుని దాన్ని బాగా శుభ్రపరచాలి.


తరువాత వాటిని ముక్కలుగా చేసి పక్కకు పెట్టుకోవాలి. తరువాత ఒక నిమ్మకాయను తీసుకుని బాగా శుభ్రంగా కడిగి నిమ్మకాయను పొట్టుతో సహా బాగా తురమాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్ళని తీసుకుని వేడి చేయాలి. ఆ నీళ్లు వేడయ్యాక అల్లం ముక్కలను, నిమ్మకాయ తురుమును వేసి మరిగించాలి.తరువాత ఈ నీళ్లని వడకట్టి ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. తరువాత ఇందులో తేనెను వేసి కలపాలి. తరువాత దీనిలో కొద్దిగా నిమ్మరసాన్ని వేసి బాగా కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ప్రతిరోజూ కూడా రెండు గంటలకొకసారి  ఒక టీ స్పూన్ మోతాదులో 5 సంవత్సరాల లోపు పిల్లలకు తాగించాలి. ఇంకా అలాగే ఒకటిన్నర టీ స్పూన్ మోతాదులో 12 సంవత్సరాల లోపు పిల్లలకు దీన్ని తాగించాలి.ఇక 12 సంవత్సరాల పై బడిన వారు రెండు టీ స్పూన్ల మోతాదులో రెండు గంటలకొకసారి తాగుతూ ఉండాలి. ఈ విధంగా ఈ టిప్ ని తయారు చేసుకుని వాడడం వల్ల మనం దగ్గు నుండి చాలా ఈజీగా ఉపశమనాన్ని పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: