గోరువెచ్చని నీరు తాగడం వల్ల దుష్ప్రభావలెంటో తెలుసా..!

Divya
సాధారణంగా గోరు వెచ్చని నీళ్ళు త్రాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు వుంటాయని చాలా మంది వేడి నీరు త్రాగటం అలవాటు చేసుకుంటారు. అయితే అతిగా ఏది చేసిన అనర్తమే అంటారు పెద్దలు. అలాంటి వాటిల్లో ఇది కూడా ఒకటి.వేడి నీళ్లు తాగడం వల్ల కూడా కొన్ని నష్టాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.అవేంటో ఇప్పుడు చూద్దాం..

ఉదయం లేవగానే గోరువెచ్చని మంచినీరు తాగడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని అందరికి తెలుసు.రోజు గోరు వెచ్చని నీరు తాగడం వల్ల మన శరీరంలో ని వ్యర్థాలు బయటకు విసర్జీంపబడతాయి. కానీ ఎక్కువగా గోరు వెచ్చని నీరు తీసుకోవడం వల్ల నోటిపూత ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.అలాగే నోటిలో చిన్న కాలిన గాయాలకు కారణమైతే, అది ఖచ్చితంగా శరీరంలోని అంతర్గత అవయవాలు దెబ్బ తినడానికి దోహదం చేస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తుంటారు.
అధికంగా వేడి నీరు త్రాగటం మూలాన దెబ్బ తినే అవయవాలు పుడ్ పైప్ మరియు జీర్ణవ్యవస్థ.వీటి లోపలి పొర చాలా సున్నితంగా ఉంటుంది. వేడి నీటి ఉష్ణోగ్రత శరీర ఉష్ణోగ్రత కంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఆ అవయవాలు చాలా ప్రభావితమవుతాయి కనుక అతి వేడినీటిని తాగకూడదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.వేడి నీటిని అధికంగా తీసుకోవడం వల్ల మూత్రపిండాలపై అదనపు పనిభారం పడుతుంది.దీంతో మూత్రపిండాలు దెబ్బతినె అవకాశం ఉంటుంది. ఎప్పుడూ వేడి నీటిని తాగడం వల్ల శరీరంలో ఒక్కోసారి నీటి సమతుల్యత దెబ్బతింటుంది. కొన్ని రకాల మందులు వేడి నీటితో వేసుకోరాడు. అలా మింగడం వల్ల మందుల పనిచేయకపోయే ప్రమాదం ఉంటుంది.
 ఎక్కువగా వేడి నీరు త్రాగటం వల్ల మెదడు కణాల వాపుకు కారణమవుతాయి. కనుక ఇది శరీర ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం.వేడి నీటిని ఎక్కువగా తాగడం కూడా రక్త చిక్క బడే అవకాశాలు కూడా ఉంటాయి.అవసరమైన వేడికంటే ఎక్కువ వేడి నీటిని తీసుకోవడం వల్ల మొత్తం రక్తశాతం పెరుగుతుంది.దీంతో గుండె పనితీరు దెబ్బతింటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: