క్యారెట్: ఎన్ని ఉపయోగాలో తెలుసా?

Purushottham Vinay
క్యారెట్  ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది. ప్రతి రోజూ కూడా క్యారెట్ జ్యూస్  తాగడం వలన శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి ఇన్‏ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. ఇంకా అంతే కాకుండా శరీరంలో వచ్చే వాపులను కూడా అధిగమించవచ్చు. బాక్టీరియా ఇంకా వైరస్ లాంటివి కూడా చాలా ఈజీగా నశిస్తాయి. వీటిలో ఉండే విటమిన్ బి6, కె. పొటాషియం ఇంకా పాస్ఫరస్‏లు ఎముకలను దృఢంగా మారుస్తాయి. అలాగే క్యారెట్‌ గుండె సమస్యలను కూడా తగ్గిస్తుంది. శరీరంలో ఫ్రీ ర్యాడికల్స్ అనే అణువులు ఉండడం వలన రోగనిరోధక శక్తి తగ్గుతుంది. వీటి వల్ల క్యాన్సర్ ఇంకా డయాబెటిస్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. క్యారెట్ జ్యూస్ తాగడం వలన అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆ ఫ్రీ ర్యాడికల్స్ అణువులను నాశనం చేయడంతోపాటు ఇంకా అలాగే శరీరంలో ఉండే విష పదార్థాలను కూడా బయటకు పంపుతాయి.ఈ క్యారెట్‌లో ఉండే విటమిన్లు జుట్టు పొడిబారకుండా కూడా చేస్తుంది.ప్రతి రోజు ఉదయాన్నే క్యారెట్‌ తింటే జీర్ణక్రియ బాగా మెరుగ్గా ఉంటుంది.


పోటాషియం రక్త నాళాల ధమనుల ఉద్రిక్తతను తగ్గించేందుకు క్యారెట్‌ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంకా అలాగే శరీరంలో రక్త ప్రసరణ పెంచేందుకు కూడా ఉపయోగపడుతుంది.చర్మం చాలా కాంతివంతగా ఉంచుతుంది. క్యారెట్‌ తినడం వల్ల శరీరంలో ఉండే కొవ్వు కూడా ఈజీగా కరిగిపోతుంది.అందువల్ల బరువు కూడా తగ్గేందుకు దోహదపడుతుంది. ఈ క్యారెట్‌లో రక్తహీనత పోగొట్టే గుణం ఉంటుంది. ఇక ఇది ప్రేగుల్లో వ్వర్థాలను శుభ్రం చేసేలా చేస్తుంది. క్యారెట్‌ను ఎక్కువగా తీసుకోవడం వల్ల మలబద్దకాన్ని దూరం చేస్తుంది. క్యారెట్‌లో పోషక విలువలతో పాటు రోగనిరోధక శక్తి పెంచే గుణాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి.క్యారెట్ రసం కంటి చూపుకి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. క్యారెట్‌లో విటమిన్ A పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి చూపుని మెరుగు పరచడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రతి రోజు క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: