ఒంట్లో వేడి తగ్గాలంటే ఇలా చేయండి..?

Divya
ప్రస్తుతం ఉన్న కాలంతో సంబంధం లేకుండా శరీరంలో నుంచి అధిక వేడితో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. దీంతో పలానా ఆరోగ్య సమస్యల బారిన కూడా పడే అవకాశం ఉంటుంది. అయితే ఇందుకు కారణాలు మాత్రం నీటిని తక్కువగా తాగడం వల్ల తరచూ ఎక్కువగా ఆందోళనకు గురవడం వల్ల, లేదంటే థైరాయిడ్ గ్రంథి సరిగా పని చేయలేకపోవడం వల్ల, శరీరంలో వేడెక్కుతుందని వైద్యులు తెలియజేస్తున్నారు. ఇక శరీర ఉష్ణోగ్రత సాధారణంగా అయితే 97.7 నుంచి 99.5 డిగ్రీల పారాహిట్ మధ్యలో ఉంటుంది. కానీ ఎండలో ఎక్కువ సమయం గడపడం వల్ల శరీర ఉష్ణోగ్రత గణనీయంగా పెరుగుతుందని చెప్పవచ్చు.అయితే మహిళలకు మాత్రం శరీరంలోని వేడి మోనోపాజ్ వంటి పరిస్థితుల కారణంగా పెరుగుతుంది. శరీరంలో వేడి ఎక్కువైతే కళ్ళు మంట, కడుపులో మంట తలనొప్పి, నీరసం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని అలవాట్లు చేసుకోవడం వల్ల శరీరంలోని ఉండే వేడిని తగ్గించుకోవచ్చట వాటి గురించి తెలుసుకుందాం.

1). తరచుగా నీళ్లు లేదంటే ఏదైనా ద్రవాన్ని తాగుతూ ఉండడం వల్ల శరీర ఉష్ణోగ్రత కంట్రోల్లో ఉంటుందట. ముఖ్యంగా కొబ్బరి నీరు మజ్జిగ వంటివి తాగితే వేడి తగ్గుతుందని నిపుణులు తెలుపుతున్నారు
2). ఉదయాన్నే ఒక గ్లాసు నిమ్మరసం తాగితే ఒంటిలో ఉండే వేడి తగ్గుముఖం పడుతుంది. ఉప్పు లేదా పంచదార వేసుకొని నిమ్మకాయ నీటిని తాగడం వల్ల వేడి నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు.

3). ఇక ఉదయం లేవగానే దానిమ్మ జ్యూస్ తాగడం వల్ల వేడి నుంచి ఉపశమనం పొందవచ్చు.
4). రోజులో ఎప్పుడైనా సరే బార్లీ గింజలు వేడి నీళ్లలో కాంచి మజ్జిగలా చేసుకుని  తాగితే వేడి తగ్గుతుందట.
5). కర్బూజ పండుగ చిన్న చిన్న ముక్కలుగా చేసి వీటిని తింటూ ఉండడం వల్ల వేడి తగ్గుతుంది.
6). అలోవెరా జ్యూస్ ఎక్కువగా చలువనిస్తుంది. అందుచేతనే ఈ జ్యూస్ ని నుదుటిన రాసుకుంటే చాలా హాయిగా అనిపిస్తుంది. అలోవెరా జ్యూస్ ను తలకు పట్టించుకుని స్నానం చేస్తే వేడి తగ్గుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: